ఇక‌పై క‌రోనాను దాచిపెట్ట‌లేరు.. కొత్త రూల్స్ వచ్చాయ్.. జాగ్ర‌త్త‌!

గ‌త ఏడాది చైనాలోని వూహాన్ న‌గ‌రంలో పుట్టుకొచ్చిన ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్‌.అన‌తి కాలంలోనే ప్ర‌పంచ‌దేశాలు క‌మ్మేసి ప్ర‌జ‌ల‌ను, ప్రభుత్వాల‌ను నానా ఇబ్బందులు పెడుతోంది.

 New Rules Have Arrived In Corona Test Centers!! New Rules, Corona Test Centers,-TeluguStop.com

దీంతో క‌రోనా అంటేనే ప్ర‌జ‌లు ఆమ‌డ‌దూరం పారిపోతున్నారు.ప్ర‌స్తుతం దేశ‌ల‌న్నీ అన్‌లాక్ ప్ర‌క్రియ ప్రారంభించ‌డంతో.

క‌రోనా మ‌రింత వేగంగా విజృంభిస్తోంది.

వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేక‌పోవ‌డంతో.

క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డం సాధ్యం కావ‌డం లేదు.మ‌రోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్ర‌వేత్త‌లు కరోనా విరుగుడుకు వ్యాక్సిన్ ను కనిపెట్టేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు.

అయిన‌ప్ప‌టికీ క‌రోనా వ్యాక్సిన్ ఎప్పుడు వ‌స్తుంది? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం లేదు.ఇదిలా ఉంటే.

కొంద‌రు త‌మ‌కు క‌రోనా సోకితే, ఆ విష‌యం ఎవ్వ‌రికి తెలియ‌కుండా ఉండేందుకు.టెస్ట్ చేయించుకునే స‌మ‌యంలో తప్పుడు ఫోన్ నెంబ‌ర్లు ఇస్తున్నారు.

ఇలా చేయ‌డం వ‌ల్ల‌ పాజిటివ్ గా తేలిన వారిని గుర్తించటంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.అయితే ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగాసరికొత్త విధానాల్ని అమ‌ల్లోకి తీసుకొచ్చింది.

క‌రోనా పరీక్ష కేంద్రానికి వెళ్తే.అక్కడ ఒక అప్లికేషన్ ఇస్తారు.

అందులో పేరు, ఇంటి అడ్రస్, ఆధార్ నెంబరుతో పాటు మొబైల్ నెంబరును రాయాల్సి ఉంటుంది.

వాటిని అధికారులు ఆన్ లైన్ లో రిజిష్టర్ చేసుకున్న వెంట‌నే.

సదరు మొబైల్ కు ఓటీపీ వస్తుంది.ఆ నెంబరు చెబితేనే ఇక‌పై క‌రోనా టెస్టు చేస్తారు.

ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల‌.తప్పుడు ఫోన్ నెంబరు ఇచ్చేవారు అడ్డంగా బుక్ అయిపోతారు.

ఇక ఓటీపీ చెప్పేవాళ్ల‌కు పరీక్ష చేస్తారు.ఫలితం వచ్చిన త‌ర్వాత‌ ఆన్ లైన్ లోనే సమాచారాన్నిఅప్పటికప్పుడు నమోదు చేస్తారు.

సో.త‌ప్పుడు ఫోన్ నెంబ‌ర్ ఇచ్చి క‌రోనాను దాచిపెట్ట‌లంటే.ఇకపై కుదర‌దు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube