కువైట్ వెళ్లే వారికి కొత్త నిబంధన.. వలస కార్మికులకు కష్టాలు..

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల ప్రజలు వేరే దేశాలకు వలస వెళ్లి జీవిస్తూ ఉంటారు.ఆ దేశాలలో చిన్న పనుల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఉద్యోగాల వరకు చేస్తూ ఉంటారు.

 New Rule For Those Going To Kuwait  Difficulties For Migrant Workers , Kuwait  D-TeluguStop.com

అలా వలస వెళ్లే మన దేశ ప్రజలకు కువైట్ వీసా నిబంధనలను సవరించింది.కువైట్ నుంచి ఈ విసాలు జారీ అయిన తర్వాత అవి అసలు వీసాలో, నకలి వీసాలో తేల్చడానికి ఆ దేశం కాన్సులేట్‌ల ధ్రువీకరణ కోసం పంపించాల్సి ఉంటుంది.

ఈ కొత్త నిబంధన 15 రోజుల క్రింద అమలులోకి వచ్చింది.

విసాలను కాన్సులేట్‌ పరిశీలన కోసం పంపడం వల్ల సమయం వృధాతో పాటు ఆర్థికంగా భారం పడుతుందని వలస కార్మికులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.

కువైట్లో ఉపాధి పొందాలనుకునే వారు లైసెన్డ్ ఏజెన్సీ లేదా తమకు తెలిసిన వారి ద్వారా విసాలను పొందిన తర్వాత పోలీసులు క్లియరెన్స్‌ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.

Telugu International, Kuwait, Kuwait Migrant, Kuwait Visa, Consulates-National N

గల్ఫ్‌ దేశాల్లో ఒక కువైట్ కు మాత్రమే పిసిసి తప్పనిసరి అనే నిబంధన ఉంది.ఇప్పుడు వీసా కాపీలను అదనంగా చేర్చారు.కువైట్ నుంచి వీసాలను ఆన్లైన్లోనే జారీ చేస్తున్నారు.

ఈ వీసాలు అన్నీ కువైట్ విదేశాంగ శాఖ ద్వారానే జారీ అవుతున్నాయి.విదేశాంగ శాఖ ఆమోదంతోనే వీసాలు జారీ అయితే వాటిని మరోసారి తమ కాన్సులేట్‌ల్లో పరిశీలనకు పంపాలని కువైట్ ప్రభుత్వం సూచిస్తోంది.

Telugu International, Kuwait, Kuwait Migrant, Kuwait Visa, Consulates-National N

అంతే కాకుండా కువైట్ విదేశాంగ శాఖకు సంబంధించిన కాన్సు లేట్‌లు ఢిల్లీ, ముంబైలో ఉన్నాయి.తెలుగు రాష్ట్రాల్లో నుంచి భారీగా వలసలు కొనసాగుతున్నాయి.హైదరాబాద్ లో కాన్సులేట్‌ ఏర్పాటు చేయాలని కొన్ని సంవత్సరాల నుంచి వలస కార్మికులు కోరుతున్నారు.కువైట్ ప్రభుత్వం గతంలో సానుకూలంగా స్పందించిన ఇప్పటివరకు నేర్చుకోలేదు.ప్రభుత్వం కొత్త నిబంధన అమల్లోకి తీసుకురావడంతో కాన్సులేట్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని డిమాండ్ కూడా మళ్ళీ తెరపైకి రావడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube