న్యూస్ రౌండప్ — టాప్ 20  

New Rounup top twenty todya, Biden, GHMC, Ajith Doval, ICC Cricket Age Limet, julai movie, Corona Cases in India, Tirupati Elections, Sonia Gandhi, BJP, KCR letter to Modi, - Telugu Ajith Doval, Biden, Bjp, Corona Cases In India, Ghmc, Icc Cricket Age Limet, Julai Movie, Kcr Letter To Modi, Sonia Gandhi, Tirupati Elections

1.నిమిషానికో కరోనా మరణం


TeluguStop.com - New Rounup Top Twenty Todya

అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది.నిమిషానికి ఒక్కరు ఈ వైరస్ మహమ్మారి కారణంగా మరణిస్తున్నారు.గురువారం నాటికి 2.5 లక్షల మంది అమెరికన్లు ఈ కరుణ కారణంగా మరణించారు.ఇంకా 1.15 కోట్ల వరకు యాక్టివ్ కేసులు ఉన్నాయి.

2.డబ్ల్యూహెచ్వో పై బైడన్ …


ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూ హెచ్వో ) లో మళ్లీ అమెరికా చేరబోతోంది అంటూ అమెరికా కొత్త అధ్యక్షుడు గా ఎంపికైన జో బైడన్ ప్రకటించారు.

3.తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం


ఏపీ లోని కర్నూలు జిల్లా సంకల్ బాగ్ గాట్ లో తుంగభద్ర పుష్కరాలను ఏపీ సీఎం జగన్ ప్రారంభించారు.డిసెంబరు ఒకటో తేదీ వరకు పుష్కరాలు జరగబోతున్నాయి.

4.ప్రధానికి కేసీఆర్ లేఖ


కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీ పరీక్షలను హిందీ ఇంగ్లీష్ భాష లోనే కాకుండా ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు.

5.ఎస్ బి ఐ లో ఉద్యోగాలు


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన 8500 అప్రెంటిస్ పోస్టులను ప్రకటించింది.దేశవ్యాప్తంగా వేరువేరు రోజుల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తోంది.వాటిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నాయి.మరిన్ని వివరాల  కోసం https://sbi.co.in/ వెబ్ సైట్ లో careers సెక్షన్ లో వివరాలు ఉన్నాయి.

6.బిజెపి సర్వేల్లో ఇలా తేలిందట


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి మెజారిటీ స్థానాలను దక్కించుకుని అధికారం దక్కించుకోబోతున్నట్లు సర్వేలన్నీ తేల్చి చెప్పాయి అని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

7.టీఆర్ఎస్ అభ్యర్ధుల చివరి జాబితా విడుదల


ఇప్పటికే టీఆర్ఎస్ గ్రేటర్ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తూ వస్తున్న ఆ పార్టీ ఫైనల్ లిస్టు ను కూడా విడుదల చేసింది.దీంతో మొత్తం 150 డివిజన్లను అభ్యర్థులను టిఆర్ఎస్ ప్రకటించినట్లు అయింది.

8.క్రికెట్ లో మినిమమ్ ఏజ్ పాలసీ


అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించేందుకు గతంలో వయసు నిబంధన ఉండేది కాదు.అయితే ఇప్పుడు కొత్త నిబంధనను విధించారు.అంతర్జాతీయ క్రికెట్ ఆడాలంటే పదిహేనేళ్లు ఉండాలనే నిబంధనలను చేర్చారు.

9.ప్రభుదేవా రహస్య పెళ్లి


ప్రముఖ కొరియోగ్రాఫర్ హీరో ప్రభుదేవా రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.బీహార్కు చెందిన ఫిజియోథెరపిస్ట్ ను ఆయన పెళ్లి అయినట్లు సమాచారం.ఈ విషయాన్ని ప్రభుత్వ స్నేహితుడొకరు మీడియాకు లీక్ చేశారు.

10.ఢిల్లీకి ఇక సోనియా గాంధీ దూరం

ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా వేరే ప్రాంతానికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలని సోనియా గాంధీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.తమిళ్ కొంతకాలంగా దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న నేపథ్యంలో డాక్టర్ల సూచన మేరకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.చెన్నై,  గోవాలో కానీ ఆమె విశ్రాంతి తీసుకోబోతున్నట్టు సమాచారం.

11.కూకట్ పల్లి బిజెపి కార్యాలయం ధ్వంసం


బిజెపిలో గ్రేటర్ లొల్లి మొదలైంది.కూకట్ పల్లి  నియోజకవర్గం లో టిక్కెట్లు అమ్ముకున్నారని కొంతమంది బిజెపి కార్యకర్తలు పార్టీ ఆఫీసులో విధ్వంసానికి పాల్పడి కుర్చీలు, అద్దాలు ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు.ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

12.ముగిసిన గడువు


గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు డిసెంబరు ఒకటో తేదీన జరగబోతున్న సంగతి తెలిసింది దానికి సంబంధించి ఈరోజు తో నామినేషన్ల గడువు ముగిసింది.దీంతో నామినేషన్లు వేసేందుకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు రిటర్నింగ్ ఆఫీసులో వద్ద కు చేరుకున్నారు.

13.బిజెపి కే జనసేన మద్దతు


గ్రేటర్ ఎన్నికల్లో బిజెపికి మద్దతు ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ తో జరిపిన చర్చలు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

14.ఎమ్మెల్సీ పదవి హామీ


తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక రాబోతోంది.అయితే ఇక్కడ ఆయన కుమారుడికి ఆ సీటు ఇస్తారని భావించిన జగన్ ఎంపీ దుర్గాప్రసాద్ కుమారుడు కళ్యాణ్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

15.హీరోయిన్ రష్మిక కు గూగుల్ అవార్డ్

2020 సంవత్సరానికి గాను ‘ నేషనల్ క్రషర్ ఆఫ్ ఇండియా ‘ గా తెలుగు, కన్నడ హీరోయిన్ రష్మికకు ఈ అవార్డ్ వచ్చింది.రష్మిక డ్రెస్సింగ్ స్టైల్ నచ్చడం వల్లనే ఈ గుర్తింపు వచ్చిందట.

16.భారత్ లో కరోనా కేసులు


భారత్ లో కరుణ కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు గా కనిపించిన ఇప్పుడు మరింతగా విజృంభిస్తున్నాయి.గడచిన 24 గంటల్లో 45,882 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం దేశవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 90,04,365 కి చేరింది.

17.చెల్లిని తుపాకితో కాల్చిన అన్నయ్య


అదే పనిగా ఓ యువకుడితో చాటింగ్ చేస్తూ, ఫోన్ మాట్లాడుతుంది అనే కారణంతో ఢిల్లీలో ఓ యువకుడు తన చెల్లి పై కాల్పులు జరపగా, తీవ్ర గాయాలయ్యాయి.ఈ కేసు ను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

18.హిందీలో అల్లు అర్జున్ సినిమా


అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరుగుతూ వస్తోంది.అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన  ‘జులాయి ‘ సినిమా హిందీలో రీమేక్ కాబోతోంది.

19.హీరో అజిత్ కు గాయాలు


కోలీవుడ్ స్టార్ హీరో  అజిత్ షూటింగులో ప్రమాదానికి గురై, స్వల్ప గాయాలు పాలైనట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆయన ‘ వలిమై ‘ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు.ఈ సినిమా షూటింగులో భాగంగా హైదరాబాద్ లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా, ఆయన ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.

20.మోదీ అమిత్ షా అజిత్ దోవల్ కీలక భేటీ


జమ్ము కాశ్మీర్ లోని నగ్రోటా లో ఎన్ కౌంటర్ జరగడం , అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు.ఈ సమావేశం పై ఉత్కంఠ నెలకొంది.

#ICCCricket #Biden #Ajith Doval #Sonia Gandhi #GHMC

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

New Rounup Top Twenty Todya Related Telugu News,Photos/Pics,Images..