8 సీటర్ కార్లలో కొత్త నిబంధనలు తప్పనిసరి

కార్లలో ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 8 సీటర్ కార్లలో కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అందించడాన్ని తప్పనిసరి చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.‘ఇంటెల్ ఇండియాస్ సేఫ్టీ పయనీర్స్ కాన్ఫరెన్స్ 2022’ని ఉద్దేశించి గడ్కరీ మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు.దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఐదు లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయని, 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు.మోటారు వాహనాల్లో కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరిగా అందించాలని నిర్ణయించామని, ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నామని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి తెలిపారు.

 New Regulations Are Mandatory In 8 Seater Cars , 8 Seater ,car , New Rules, Aler-TeluguStop.com

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జనవరిలో మోటారు వాహనాలలో ప్రయాణించేవారి భద్రతపై సమీక్షించింది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989ని సవరించడం ద్వారా భద్రతా లక్షణాలను మెరుగుపరచాలని నిర్ణయించింది.జనవరి 14, 2022న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేయబడింది.

దీని ప్రకారం అక్టోబర్ 1, 2022 తర్వాత తయారు చేయబడిన కేటగిరీ ఎం1 వాహనాలకు ముందు వరుసలో ఔట్‌బోర్డ్ సీటింగ్‌లో ఉన్న వ్యక్తులకు ఒక్కొక్కటి రెండు వైపు ఎయిర్ బ్యాగ్‌లు అమర్చాలి.లోపల కూడా మరో నాలుగు ఎయిర్ బ్యాగ్‌లు అమర్చాలి.

రెండు వైపులా కర్టెన్, ట్యూబ్ ఎయిర్ బ్యాగ్‌లు ఉండాలి.ఎయిర్‌బ్యాగ్ అనేది వాహనంలో ప్రయాణించే వ్యక్తులు ప్రాణాలు కోల్పోకుండా చేసే నియంత్రణ వ్యవస్థ.

ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాకుండా, ఆ ఎయిర్ బ్యాగ్‌లు కాపాడుతాయి.అవి ఓపెన్ కాగానే తలకు బలమైన గాయం కాదు.

ప్రాణాపాయం కూడా ఉండదు.అందుకే వీటిని తప్పనిసరి చేస్తూ తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube