కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఇండియన్ నటి సరికొత్త రికార్డ్

కాన్స్ ఫిలిం ఫెస్టివల్ ( Cannes Film Festival )లో ఇండియన్ నటి సరికొత్త రికార్డ్ నెలకొల్పారు.

ఈ ఫెస్టివల్ లో అనసూయ సేన్ గుప్తా ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు.

అయితే కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న తొలి ఇండియన్ నటిగా అనసూయ సేన్ గుప్తా( Anasuya Sengupta ) చరిత్ర సృష్టించారు.అంతర్జాతీయంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డును భావిస్తారు.

కాగా 77వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ ఫ్రాన్స్ లో జరుగుతున్న సంగతి తెలసిందే.‘అన్ సర్టెయిన్ రిగార్డ్ ’ విభాగంలో అనసూయ అవార్డును సొంతం చేసుకున్నారు.

బల్గేరియన్ చిత్ర నిర్మాతగా.కాన్ స్టాంటిన్ బోజనోవ్ డైరెక్షన్ లో వచ్చిన ‘షేమ్ లెస్( The Shameless )’ మూవీలో ఆమె పాత్రకు ఈ అవార్డు లభించింది.

Advertisement

ఢిల్లీలో పోలీసులను కత్తితో పొడిచి చంపి వేశ్యాగృహం నుంచి పారిపోయిన అమ్మాయి జీవిత ప్రయాణమే కథగా ఈ సినిమా తెరకెక్కింది.

హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..
Advertisement

తాజా వార్తలు