అతిగా తాగితే రోడ్డు మీదే గడపాలి - వింత శిక్ష

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తికి జైల్‌ శిక్షతో పాటు మూడు గంటలు ట్రాఫిక్‌ విధులు నిర్వహించాలని కోర్ట్‌ వింత శిక్ష విధించింది.హైదరాబాద్‌ మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు కుషాయిగూడలో నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ ఆపరేషన్‌లో నగారానికి చెందిన హన్మంతు పట్టుబడ్డాడు.

 New Punishment For Drinkers-TeluguStop.com

అతిగా మద్యం సేవించి వెహికిల్‌ నడపడంతో ట్రాఫిక్‌ పోలీసులు హన్మంతును అదుపులోకి తీసుకుని కోర్ట్‌కు హాజరు పర్చారు.

నిందితునికి రెండు రోజుల జైల్‌ శిక్ష విధించి, మూడు గంటలపాటు ట్రాఫిక్‌ విధులు నిర్వహించాలని మల్కాజ్‌గిరి కోర్ట్‌ మెజిస్ట్రేట్‌ తీర్పు చెప్పారు.

మెజిస్ట్రేట్‌ ఆదేశాల ప్రకారం నిందితుడు జైల్‌ శిక్ష అనుభవించి, అనంతరం ఇసిఐఎల్‌ చౌరస్తలో మూడు గంటల ట్రాఫిక్‌ విధులు నిర్వహించాడు.ట్రాఫిక్‌ ఎస్‌.

ఐ నాగార్జున ఆధ్వర్యంలో ఈ వింత శిక్ష పూర్తి చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube