గ్రీన్ కార్డ్ పై మరో కీలక ప్రకటన..5 వేల డాలర్లు కడితే చాలట...

అమెరికాలో ఉంటున్న ఎంతో మంది భారతీయ నిపుణులు ఎన్నో ఏళ్ళుగా అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఇచ్చే గ్రీన్ కార్డ్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.అలాంటి వారందరికీ త్వరలోనే న్యాయం జరుగుతుందని, వారి కలలు సాకారం అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయని అంటున్నారు నిపుణులు.

 New Provisions Could Ease Green Card Process For Indians, Green Card Process, In-TeluguStop.com

అర్హతలు ఉండి గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న వారు కేవలం 5 వేల డాలర్లు కడితే సరిపోతుందని తెలియడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కేవలం 5 వేల డాలర్ల సప్లమెంటరీ ఫీజు కడితే చాలు గ్రీన్ కార్డ్ పొందినట్టేనట.ఈ మేరకు

హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్ జ్యుడీషియర్ కమిటీ కీలక బిల్లును సిద్దం చేసింది.2020 లెక్కల ప్రకారం 7.40 లక్షల మంది భారతీయులు గ్రీన్ కార్డ్ కోసం అర్హతలు ఉంది మరీ ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్నారట.వీరందరికీ గ్రీన్ కార్డ్ రావాలంటే దాదాపు 80 ఏళ్ళ పైనే పడుతుందట.

కానీ అమెరికా తాజాగా ప్రవేశపెట్టనున్న బిల్లు గనుకా ఆమోదం పొందితే ప్రయారిటీ తేదీ నుంచీ రెండేళ్ళు పూర్తి చేసుకున్న వారందరూ 5 వేల డాలర్ల సప్లమెంటరీ ఫీజు చెల్లిస్తే చాలు గ్రీన్ కార్డ్ వారి సొంత అవుతుందట.ఇదిలాఉంటే

Telugu Americagreen, Fifty Dollars, Green Process, Indians, Greenprocess, Green,

గ్రీన్ కార్డ్ ఆశిస్తున్న వ్యాపారస్తులకు కూడా వెసులు బాటు కల్పిస్తోంది ఈ బిల్లు ఎలాగంటే.ఈబీ 5 కేటగిరీ లో గ్రీన్ కార్డ్ లు ఆశిస్తున్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు సుమారు 50 వేల డాలర్లు పెట్టుబడి పెడితే గ్రీన్ కార్డుకు అర్హత సాదిస్తారట.అంతేకాదు అమెరికాలో ఉంటున్న హెచ్-1బి వృత్తి నిపుణులు సైతం 50 వేల డాలర్ల పెట్టుబడి పెట్టగలిగితే గ్రీన్ కార్డ్ పొందవచ్చని తెలుస్తోంది.

అయితే ఈ బిల్లు ముందుగా ప్రతినిధుల సభ, అలాగే సెనేట్ లో ఆమోదం పొందితే తదుపరి అధ్యక్షుడు బిడెన్ సంతకమే మిగిలి ఉంటుందని , బిడెన్ సంతకంతో కార్యరూపం దాల్చుతుందని అంటున్నారు నిపుణులు.అయితే చట్ట రూపం దాల్చడమే అత్యంత కీలకమని అందుకోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నామని అంటున్నారు భారతీయ ఎన్నారైలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube