కొత్త క‌ష్టాల‌లో వైఎస్సార్ కాంగ్రెస్‌

ఇప్ప‌టికే 20 మంది ఎమ్మెల్యేలు త‌న‌ను కాద‌ని అధికార పార్టీ సైకిలెక్కేసినా.ఈడి త‌న ఆస్ధుల‌ను జ‌ప్తులు చేస్తున్నా వైకాపా అధినేత జ‌గ‌న్ మాత్రం త‌న‌ తీరు మార్చుకోవ‌టం లేద‌ని, ఆయ‌న‌లో జ‌గ‌న్‌లో ని సీత‌య్య మాత్రం అలాగే ఉన్నాడ‌ని పార్టీ నేత‌ల గుస‌గుస‌.

 New Problems In Ysrcp-TeluguStop.com

గ‌డ‌ప గ‌డ‌ప‌కు పార్టీని తీసుకు వెళ్లి ప్ర‌భుత్వాన్ని ఎండ‌గ‌ట్టేందుకు 6 నెల‌ల కార్య్ర‌క‌మం రూపొందించిన ఇందుకు అయ్యే ఖ‌ర్చంతా మీరే పెట్టుకోవాలంటూ శాస‌న‌స‌భ్యులు ఎంపిల‌కు స్ప‌ష్టం చేయ‌టంతో అవాక్క‌వాటం వారి వంతైంది.

ఇప్ప‌టికే ఈడీ పెద్ద మెత్తాల‌ను సీజ్ చేసినందున ఈ కార్య‌క్ర‌మానికి నిధులు ఇవ్వ‌లేన‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేయ‌డంతో ఏం చేయాలో అర్ధం కాని ప‌రిస్థితి నెల‌కొంద‌ట‌.

ఇటీవ‌లే ఆటా కార్య‌క్ర‌మం పేరుతో కుటుంబాల‌తో విదేశాలు తిరుగొచ్చిన వారంతా త‌మ ద‌గ్గ‌ర చిల్లిగ‌వ్వ‌కూడా లేద‌ని, పార్టీ ప‌నుల‌కు తామెందుకు సొమ్ము ఖ‌ర్చు చేయాల‌ని స‌న్నిహితుల వ‌ద్ద దీర్ఘాలు తీస్తున్నార‌ట‌.మ‌రోవైపు గ‌డ‌ప గ‌డ‌ప‌కు వైఎస్సార్ సిపి కి నిధులు స‌మ‌కూర్చేందుకు కాం్ర‌గెస్‌కు చెందిన నాయ‌కుల‌ను పార్టీలోనికి తీసుకువ‌చ్చి నియోజ‌క వ‌ర్గ ఇన్‌చార్జిల‌ను చేయాల‌ని ప్ర‌స్తుతం పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న మాజీ పిసిసి అధ్య‌క్షుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది.

అయితే నిధుల కోస‌మే కాంగ్రెస్ నేత‌ల‌ను పార్టీలోనికి తీసుకు రావాల‌న్నజ‌గ‌న్‌ ప్ర‌తిపాద‌న‌ల‌పై ప‌లువురు లోలోన మండి ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.ఇన్నాళ్లు పార్టీని బ‌లోపేతం చేస్తే, ఇప్పుడు కొత్త‌వారికి ఎలా అవ‌కాశం క‌లిపిస్తార‌ని తీవ్ర స్వ‌రంతో బొత్స‌నే నిల‌దీసేందుకు సిద్ద‌మ‌వుతున్న‌ట్టు స‌మాచారం.దీంతో గ‌డ‌ప గ‌డ‌ప‌కు చేరాల్సిన ప్ర‌శ్నావ‌ళుల పంపిణీ పై సందిగ్ధ‌త నెల‌కొంది.6 నెల‌లు జ‌రిగే కార్య్ర‌క‌మానికి నిధులు స‌మ‌కూర్చాల్సిన బాధ్య‌త పార్టీదేనంటూ మ‌రికొంద‌రు త‌ప్పించుకు తిరిగేందుకు సిద్ద‌మ‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.మ‌రి ప్ర‌స్తుత కొత్త క‌ష్టాన్ని అధిగ‌మించి, గ‌డ‌ప గ‌డ‌ప‌ కార్య‌క్ర‌మ విజ‌య‌వంతానికి ఎలాంటి చ‌ర్య‌లుంటాయో చూడాలి మ‌రి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube