ఫిబ్రవరిలో ఆ రెండు సినిమాలు రిలీజ్ కావడం సాధ్యమేనా.. అది ఉంటే కష్టమంటూ?

2022 సంవత్సరం జనవరి నెలలో భారీ బడ్జెట్ సినిమాలు విడుదలవుతాయని భావించిన ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది.జనవరిలో బంగార్రాజు మాత్రమే విడుదలై సక్సెస్ సాధించగా హిట్ టాక్ వచ్చినా కరోనా వల్ల ఈ సినిమాకు భారీస్థాయిలో కలెక్షన్లు దక్కకపోవడంతో నాగ్ అభిమానులు నిరాశకు గురయ్యారు.39 కోట్ల రూపాయల టార్గెట్ తో విడుదలైన ఇప్పటివరకు 35 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.

 New Problems For February Tollywood Big Movies Details Here  , Beemla Nayak , Ki-TeluguStop.com

ఈ నెలలో మరే పెద్ద సినిమా విడుదల కాకపోయినా వచ్చే నెలలో ఖిలాడీ, భీమ్లా నాయక్ సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది.

ఫిబ్రవరి 11వ తేదీన రమేష్ వర్మ డైరెక్షన్ లో రవితేజ హీరోగా తెరకెక్కిన ఖిలాడీ సినిమా విడుదల కావాల్సి ఉండగా ఫిబ్రవరి 25వ తేదీన పవన్ నటించిన భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.ఏపీలో ప్రస్తుతం 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు అమలవుతూ ఉండటంతో పాటు కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.

Telugu Bheemla Naik, Corona, Febreary, February, Khiladi, Carfew, Powan Kalyan,

ఏపీలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలవుతోంది. ఏపీలో నైట్ కర్ఫ్యూను ఎత్తివేస్తే ఖిలాడీ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.రవితేజ క్రాక్ సినిమా  సైతం గతేడాది కరోనా నిబంధనల మధ్య విడుదలై సక్సెస్ సాధించింది.ఖిలాడీతో ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేయాలని రవితేజ అనుకుంటున్నారు.మరోవైపు ఈ నిబంధనలు అమలులో ఉంటే భీమ్లా నాయక్ విడుదల కావడం కష్టమవుతుంది.

Telugu Bheemla Naik, Corona, Febreary, February, Khiladi, Carfew, Powan Kalyan,

120 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.కరోనా నిబంధనలు అమలైతే ఈ సినిమా రిలీజ్ డేట్ మారే ఛాన్స్ అయితే ఉంది.ఫిబ్రవరిలో కూడా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు చిన్న సినిమాలే ఆప్షన్లుగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube