నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్

ప్రస్తుతం హీరో నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న’ లవ్ స్టోరీ‘ సినిమాలో నటిస్తున్నారు.ఈ మధ్య కాలంలోనే ఈ సినిమా పూర్తిగా షూటింగ్ ముగిసినట్లు సందర్భంగా యూనిట్ సభ్యులు ఫోటోకు ఫోజు ఇచ్చి సోషల్ మీడియాలో వదిలారు.

 New Poster Release On The Occasion Of Nagachaitanyas Birthday, Nagachithanya, Hb-TeluguStop.com

ఈ సినిమాలో హీరో నాగ చైతన్య సరసన హీరోయిన్ సాయి పల్లవి నటిస్తోంది.తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర బంధం.

నేడు హీరో నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఈ కొత్త పోస్టర్ ను విడుదల చేసారు.

ఈ పోస్టర్ లో నాగచైతన్య ఓ పక్కా పల్లెటూరి యువకుడిలా కనబడుతూ మంచి ఫోజ్ ఇచ్చాడు.

పోస్టర్ లో నాగచైతన్య బనియన్, లుంగీ ధరించి కనబడుతున్నాడు.ఇది వరకే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, తొలిపాట ప్రేక్షకులను బాగా ఆకర్షించాయి.

ఈ సినిమాలో పూర్తిగా తెలంగాణ యాస లో హీరో హీరోయిన్లు సంభాషించబోతున్నట్లు సమాచారం.

లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

ఈ మధ్యకాలంలో తనదైన శైలిలో నాగచైతన్య కథలను ఎంచుకుంటూ మంచి దూకుడు మీద ఉన్నాడు.మజిలీ సినిమా తర్వాత నాగచైతన్య కథ ఎంచుకోవడంలో కాస్త విభిన్నంగా ఆలోచిస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.

ఈ సినిమా తర్వాత నాగేశ్వరరావు, బంగార్రాజు సినిమాల్లో నాగచైతన్య నటించబోతున్నారు.ఈ రెండు సినిమాలు మాత్రమే కాక మరో సినిమా కూడా నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు.అలాగే దిల్ రాజు నిర్మించబోతున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి తాజాగా ‘థాంక్యూ‘ అనే టైటిల్ ను ఖరారు చేసారు.ఏది ఏమైనా ‘ లవ్ స్టోరీ’ లో తెల్ల బనియన్, పంచ తో నాగచైతన్య అక్కినేని చూడటానికి అచ్చం పల్లెటూరి వ్యక్తి గా కనిపిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube