బ్రో నుండి న్యూ పోస్టర్.. ఒకే ఫ్రేమ్ లో మామ అల్లుడు.. అదిరిపోయిందిగా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ బ్రో( BRO ) ఈ మూవీపై ఆడియెన్స్ భారీ అంచనాలు పెట్టుకున్న విషయం తెలిసిందే.డివోషనల్ ట్రెండీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను వినోదయ సీతం అనే తమిళ్ బ్లాక్ బస్టర్ సినిమాను రీమేక్ గా తెరకెక్కుతున్నారు.

 New Poster Of 'bro' Reveals Pawan Kalyan Sai Dharam Dynamic Duo, Vinodhaya Sitha-TeluguStop.com

రీమేక్ అయినప్పటికీ ఈ సినిమా ప్రకటించినప్పటి నుండే అంచనాలు భారీగా పెరిగాయి.

తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.

అందులోను ఈ స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ ( Trivikram )చేయి కూడా పడడంతో ఈ సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకున్నారు.ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి పవర్ స్టార్ ఫస్ట్ లుక్ ను ఆ తర్వాత తేజ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి ఇద్దరినీ కలిపి ఉండే సాలిడ్ పోస్టర్ ను రివీల్ చేసారు మేకర్స్.ఈ రోజు ఉదయం 10 గంటలకు ఈ సినిమా నుండి పవన్, తేజ్ కలిసి ఉన్న పవర్ ఫుల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ లో ఇద్దరు కూడా సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు.అంతేకాదు అదిరిపోయే స్టైలిష్ బైక్ కూడా ఫ్యాన్స్ ను ఆకట్టు కుంటుంది.

ఒకే ఫ్రేమ్ లో మామ అల్లుడు కలిసి ఉన్న పోస్టర్ కు మెగా ఫ్యాన్స్ నుండి భారీ రెస్పాన్స్ లభిస్తుంది.ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.చూడాలి సముద్రఖని మన తెలుగు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube