వైసీపీలో కొత్త పంచాయితీ... ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా క‌ర‌పత్రాలు..!

ప్ర‌కాశం జిల్లాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం ద‌ర్శి.ఇక్క‌డ గత ఎన్నిక‌ల్లో వైసీపీ నాయ‌కుడు మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ విజ‌యం సాధించారు.గ‌తంలో వాస్త‌వానికి ఇక్క‌డ ‌టీడీపీకి పెద్ద‌గా బ‌లం లేక‌పోయినా.2014 ఎన్నిక‌ల్లో శిద్దా రాఘ‌వ‌రావు విజ‌యం సాధించారు.ఆ త‌ర్వాత ఆయ‌నే మ‌ళ్లీ పోటీ చేయాల‌ని అనుకున్నా.సాధ్యం కాలేదు.ఒంగోలు ఎంపీగా పోటీ చేయాల్సి వ‌చ్చింది.స‌రే! ఇప్పుడు వైసీపీ ఇక్క‌డ గెలిచింది.

 New Political Stratagies In Ysrcp.. Pamplates Spreading Against That Leader,ap,a-TeluguStop.com

కానీ, ఈ సంతోషం ఇక్క‌డ క‌నిపించ‌డం లేదు.ఆధిప‌త్య పోరులో నియోజ‌క‌వ‌ర్గం అల్లాడిపోతోంది.

ఇక్క‌డ నుంచి గ‌తంలో విజ‌యం సాధించి.కొన్నాళ్లు.వైసీపీ త‌ర‌పున ప్ర‌చారం చేసి.గ‌త ఎన్నిక‌ల‌కు ముందు పోటీ నుంచి త‌ప్పుకొన్న బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డి త‌న ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు తెర‌దీశారు.

నిజానికి బూచేప‌ల్లి స్వ‌యంగా త‌నంత‌ట తానే ఇక్క‌డ నుంచి త‌ప్పుకొన్నారు.ఈ స‌మ‌యంలో జ‌గ‌న్ ఆయ‌న‌ను బ‌తిమాలినంత ప‌నిచేశారు.

నియోజ‌క‌వ‌ర్గం ఆయ‌నదేనని చెప్పారు గెలుపు ఖాయ‌మ‌ని.ఒక వేళ గెలుపు గుర్రం ఎక్క‌క‌పోతే.

వేరే ప‌ద‌వి అయినా ఇస్తాన‌ని కూడా హామీ ఇచ్చారు.అయినా కూడా ఆయ‌న పోటీ చేయ‌డం లేద‌ని ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందుగానే ప్ర‌క‌టించి ప‌క్క‌కు త‌ప్పుకొన్నారు.

త‌ర్వాత ఒక‌రిద్ద‌రు పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టారు.ఈ క్ర‌మంలోనే మ‌ద్దిశెట్టి ఇక్క‌డ బ‌లంగా పోరాటం చేసి విజ‌యం సాధించారు.ఇప్పుడు పార్టీ ప‌రిస్థితి బాగుంది.అయితే.

ఇప్పుడు బూచేప‌ల్లి రాజ‌కీయం నియోజ‌క‌వ‌ర్గంపై పెరిగిపోయింది.స్థానిక ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా క‌ర‌ప‌త్రాలు ముద్రించి ప్ర‌చారం చేయ‌డం ద‌గ్గ‌ర నుంచి త‌న వ‌ర్గం వారిని కూడ‌గ‌ట్టి ఎమ్మెల్యేపై వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేసే వ‌ర‌కు వివాదం ముదిరింది.

ఎవ‌రికి వారే పైచేయి సాధించేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాల్లో నియోజ‌క‌వ‌ర్గం న‌లిగిపోతోంది.

బూచేపల్లి అనుచరులు మంత్రి బాలినేని, టీటీడీ చైర్మన్‌ వైవీలతోపాటు మరికొందరు రాష్ట్ర నేతలను కలిసి ఎమ్మెల్యే పార్టీ శ్రేణులకు న్యాయం చేయడం లేదని పిర్యాదు చేశారు.

ఎమ్మెల్యే అనుచరులు కూడా బూచేపల్లి పరోక్ష చర్యలపై పిర్యాదులు చేశారు.చివరకు ఇరువైపులా అనుచరులు బహిరంగ విమర్శలకు కూడా దిగారు.దీంతో తిరిగి ఇక్క‌డ టీడీపీ పుంజుకునేందుకు వైసీపీ నాయ‌కులే స‌హ‌క‌రిస్తున్నార‌నే కామెంట్లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube