ఏపీలో కొత్త రాజకీయ పార్టీ..!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ కొత్త రాజకీయ పార్టీ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్నట్టు సమాచారం.

 Bc Leaders To Start New Political Party In Ap, Ap, Bc Leaders ,kapu Leaders, Mud-TeluguStop.com

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు మరికొంత మంది బీసీ నాయకులు ఇటీవల కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తో భేటీ అవ్వడం జరిగింది.ముద్రగడ్డ సొంత ఊరు కిర్లంపూడి లో బీసీ నేతలు సుమారు 5 గంటల పాటు ఆయనతో భేటీ అయ్యారు.


ఈ సందర్భంగా సమాజంలో 52 శాతం ఉన్న బీసీలు 35 శాతం ఉన్న కాపులతో కలిస్తే రాజకీయాలలో బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉందని కేశన శంకర్రావు స్పష్టం చేసినట్లు సమాచారం.ఖచ్చితంగా బీసీలు మరియు కాపు సామాజిక వర్గం కలిస్తే సుమారు 85 శాతం జనాభా ఉంటుందని దీంతో రాజ్యాధికారం కచ్చితంగా సాధించే అవకాశాలు ఉండటంతో.

బీసీలు కాపుల ఆధ్వర్యంలో కొత్త రాజకీయ పార్టీ పెట్టే రీతిలో వీళ్ల సమావేశం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో బీసీ కాపు పార్టీకి సంబంధించి కొత్త ప్రకటన త్వరలోనే రానున్నట్లు ఏపీ రాజకీయ వర్గాలలో టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube