కొత్త స్కీమ్ : నెలకు వంద కడితే... మూడువేల పెన్షన్ !

నెలకు వంద రూపాయలు కడితే అరవై ఏళ్ళ తర్వాత మూడువేల పెన్షన్ అందించేలా … కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త పథకానికి తుది మెరుగులు దిద్దింది.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్‌ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌లో అసంఘటిత రంగ కార్మికులకు ఈ కొత్త పింఛన్‌ పథకాన్ని ప్రకటించారు.

 New Pention Scheme Announced By Centrel Goivernment-TeluguStop.com

ప్రధాన మంత్రి శ్రమయోగి మాంధన్‌ పేరుతో ఈ పథకంలో 60 ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి నెలా 3వేలు పింఛన్‌ వచ్చే విధంగా రూపొందించారు.

నెలసరి ఆదాయం 15వేల లోపు ఉండే వారు 29 ఏళ్ల వయస్సులో ఈ పథకంలో చేరితే 60 ఏళ్లు వచ్చే వరకూ వారు నెలకు 100 కట్టాల్సి ఉంటుంది.18 ఏళ్లకే చేరితే నెలకు 55 చెల్లిస్తే 60ఏళ్ల తర్వాత 3వేల పింఛన్‌ అందుతుంది.అసంఘటిత రంగంలోని 10 కోట్ల కార్మికులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.

కార్మికులు కట్టిన ప్రీమియంకు సమానమైన మొత్తాన్ని ప్రభుత్వం ప్రతి నెలా వారి పింఛను ఖాతాలలో జమ చేస్తుంది.ఈ పథకానికి ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube