ఎన్నారైలకి పెన్షన్ పధకం..!!!  

New Pension Plan For Indian Nri People In India-

విదేశాల్లో ఉంటున్న ఎన్నారైల కోసం కేరళ ప్రభుత్వం సరికొత్తగా ఆలోచన చేసింది.వారికోసం ప్రవాసీ డివిడెండ్ పెన్షన్ పధకం ని ప్రారంభించింది.ఈ పధకం కింద సుమారు ఒకేసారి రూ.5 లక్షలను ఇవ్వనుంది.ఈ పధకం యొక్క వివరాలు కేరళ గవర్నర్ పీ.సదాశివమ్ పూర్తి వివరాలతో తెలిపారు.

New Pension Plan For Indian Nri People In India--New Pension Plan For Indian NRI People In India-

విదేశాలలో ఉంటున్న లక్షలాది మలయాళీ లకోసం కేఐఐఎఫ్‌బీ(కేరళ ఇన్ఫాస్ట్రక్చర్ ఇన్‌వెస్ట్‌మెంట్ ఫండ్ బోర్డ్) ద్వారా వారి వారి మౌళిక సదుపాయాల కోసం రూ.5 లక్షల రూపాయలను డిపాజిట్ చేస్తున్నట్టుగా తెలిపారు.అంతేకాకుండా ఈ పధకం కోసం మరిన్ని వివరాలు వారు తెలుసుకొనేందుకు కాల్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపారు.

ఈ కాల్ సెంటర్ ద్వారా విదేశాలలో ఉంటున్న తమ ఎన్నారైలు వారు అక్కడ పడుతున్న ఇబ్బందుల గురించి కూడా తెలియపరచవచ్చు అంటున్నారు.కాల్ సెంటర్ తో పాటుగా వివిధ దేశాలలో ఉన్న ఉద్యోగ అవకాశాల గురించి కూడా తెలుసుకునేలా ఓ వెబ్సైటు ని ప్రారంభించ నున్నట్టుగా తెలుపుతున్నారు.