తెలంగాణలో కొత్త పార్టీలు ... టీఆర్ఎస్ కి మేలే కదా ? 

ఈ మధ్య కాలంలో తెలంగాణలో కొత్త పార్టీలో జోరు పెరిగిపోయింది.ఎవరికివారు సొంతంగా పార్టీ పెడుతూ, తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

 New Parties In Telangana Benefit On Trs, Telangana, Trs, Congress, Bjp, Etela Ra-TeluguStop.com

ఈ మధ్యనే వైఎస్ షర్మిల వైఎస్సార్ టిపీ పేరుతో కొత్త పార్టీ పెట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు.ఇంకా అనేక సమస్యలను ప్రస్తావిస్తూ రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు.

ఏం చేసిన షర్మిల పార్టీ అధికారంలోకి రావడం అంటే అది ఆషామాషీ కాదు.అంత బలం ఆ పార్టీకి లేదని, షర్మిల పార్టీ పై అంత సానుకూలత లేదు అనేది విశ్లేషకుల అభిప్రాయం.

అయితే షర్మిల పార్టీ కచ్చితంగా అధికార పార్టీపై ఉన్న వ్యతిరేక ఓట్లను చీల్చుతుంది అనడంలో సందేహం లేదు.

మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ నిన్ననే బహుజన సమాజ్ వాది పార్టీలో చేరారు.

ఆయన సైతం టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు.దీంతో ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఖచ్చితంగా చేల్చుతారు.

అయితే ఈ కొత్త పార్టీలు ఎవరికి మేలు చేస్తాయి ? ఎవరి ఓట్లకు గండి పెడతాయి అనేది లెక్కలు వేసుకుంటే ఈ పార్టీల కారణంగా టీఆర్ఎస్ కే ఎక్కువ మేలు ఎక్కువగా జరిగేలా కనిపిస్తోంది.ఎందుకంటే అధికార పార్టీపై వ్యతిరేకత తో ఓట్లు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్ బిజెపిలకు వెళ్ళాలి.

అయితే ఆ ఓట్లు గంపగుత్తగా ఆయా పార్టీలకు వెళ్ళకుండా, ఈ కొత్త పార్టీలు ఓట్లను ఖచ్చితంగా చీల్చుతాయి.ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలనే చూసుకుంటే  టీజేఎస్ అధినేత కోదండరాం ఎప్పుడో పార్టీని పెట్టారు.

Telugu Congress, Etela Rajender, Hujurabad, Telangana, Ys Sharmila, Ysrtp-Telugu

స్వయంగా ఆయనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినా, గెలవ లేకపోయారు.అలాగే తీన్మార్ మల్లన్న కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి చెందారు.అయితే అధికార పార్టీ వ్యతిరేక ఓట్లను మాత్రం బాగా చీల్చ గలిగారు.దీంతో బిజెపి కాంగ్రెస్ లకు ఆ అవకాశం లేకుండా సునాయాసంగా టిఆర్ఎస్ అభ్యర్థి గెలిచేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి.

ఇప్పుడు షర్మిల పార్టీ, ప్రవీణ్ కుమార్ ఎలా ఇంకొన్ని కొత్త పార్టీలు పుట్టుకు వచ్చినా, ఖచ్చితంగా టిఆర్ఎస్ కు మేలు చేస్తుందనే విషయం అర్థం అవుతోంది.ఈ కొత్త పార్టీ ల కారణంగా దెబ్బ తినేది ఖచ్చితంగా బిజెపి కాంగ్రెస్ వంటి పార్టీలు అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube