డిజిటల్ హోమ్ థియేటర్స్ గా మారుతున్న ఓటీటీ ఛానల్స్

లాక్ డౌన్ తర్వాత సినిమా ఎంటర్టైన్మెంట్ పూర్తిగా మారిపోయింది. కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లు మూతపడటంతో పాటు సినిమా షూటింగ్ లు కూడా చాలా కాలం ఆగిపోయాయి.

 New Ott Channels In Digital Entertainment Compilation, Tollywood, Bollywood, Sou-TeluguStop.com

థియేటర్ల మీద ఆధారపడి బ్రతికే ఎన్నో కుటుంబాలు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు వెళ్లిపోయాయి.ఇక లాక్ డౌన్ తర్వాత సినిమా షూటింగ్ లు స్టార్ట్ అయినా కూడా థియేటర్లు ఓపెన్ చేసే పరిస్థితి మొన్నటి వరకు లేదు.

ఇప్పుడు ఓపెన్ చేసిన థియేటర్లకి సినిమా చూడటానికి వెళ్లే ప్రేక్షకులు పెద్దగా కనిపించడం లేదు.ఇంటి పట్టునే ఉంటూ డిజిటల్ మీడియా ద్వారా కావాల్సిన సినిమాని కావాల్సిన సమయంలో చూసుకునే వెసులుబాటు దొరకడంతో థియేటర్లకి వెళ్లే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

చిన్న సినిమాలు థియేటర్ లో రిలీజ్ చేసిన వాటిని చూడటానికి వెళ్లే ప్రేక్షకులు లేరు.దీంతో వారంతా ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు.

పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తే థియేటర్లు మళ్ళీ తిరిగి కొంత వరకు పుంజుకునే అవకాశం ఉంది.

Telugu Bollywood, Ott Channels, Tollywood-Movie

అయితే ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయి డిజిటల్ ఎంటర్టైన్మెంట్ వైపు చూడటంతో ఓటీటీ చానల్స్ కి డిమాండ్ పెరిగింది.చక్కగా ఇంట్లో కూర్చొని కుటుంబం అంతా కలిసి సినిమాలు చూసుకుంటున్నారు.ఓ విధంగా చెప్పాలంటే డిజిటల్ హోమ్ థియేటర్స్ క్రింద ఓటీటీ చానల్స్ మారిపోయాయి.

ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, హాట్ స్టార్ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లో హవా సృష్టిస్తున్నాయి.కొత్త సినిమాలని కొనేసి రిలీజ్ చేస్తున్నాయి.అయితే ఓటీటీ హవా పెరగడంతో కార్పొరేట్ వర్గాలు ఈ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నారు.చాలా మంది ఇప్పుడు ఓటీటీ చానల్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.

కొంత మంది ఇప్పటికే స్టార్ట్ చేసేశారు.సురేష్ ప్రొడక్షన్, అలాగే అన్నపూర్ణ వాళ్ళు ఓటీటీని తీసుకొచ్చే పనిలో ఉన్నారు.

అలాగే ఊర్వశి ఓటీటీ అని కొత్తగా లాంచ్ అయ్యింది.అలాగే మరికొన్ని ఓటీటీ చానల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి.

మరి ఈ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ కాంపిటేషన్ ఇప్పటికే స్టాండర్డ్ అయిన వాటిని తట్టుకొని కొత్త ఓటీటీ ఛానల్స్ ఎంత వరకు నిలబడతాయి అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube