మార్చి తరువాత జియో ఆఫర్ ఇలా ఉండబోతోందన్నమాట

జియో రావడం వలన ఇంటర్నెట్ ఎంత చవకగా మారింది అంటే, డేటా మీద ఖర్చుపెట్టడం అనవసరం అనే స్థాయికి చేరిపోయారు చాలామంది.అలా అలవాటు చేసింది మరి జియో.

 This Could The New Offer From Jio After March-TeluguStop.com

ఇప్పుడు జియో లేని మన స్మార్ట్ ఫోన్ ని ఊచించుకోవడం కూడా కష్టం ఏమో ! మరి ఈ జియో పొడిగించిన ఆఫర్ కూడా మరో రెండు నెలల తరువాత, అంటే మార్చి నుంచి అందుబాటులో ఉండదు కదా.అక్కడినుంచి మనం డేటా కొనాల్సిందే కదా.అప్పుడేంటి పరిస్థితి ?

జియో సిమ్ తీసి బయటపడేస్తారా ? ఈ పనే చేస్తారేమో అనే భయం పట్టుకుంది జియోకి.ఎందుకంటే ఇది మిగితా నెట్వర్క్స్ లాగా 2G, 3G నెట్వర్క్స్ లో పనిచేయదు.

కాల్ డ్రాప్స్ సమస్య తగ్గినా, ఇంకా ఆ సర్వీసు పూర్తిగా మెరుగుపడలేదు.అందరు ఆ ఉచిత ఇంటర్నెట్ కోసమే జియో వాడుతున్నారు.

అది కూడా లేకపోతే ఇంకెందుకు జియో అని అనుకుంటే ? అందుకే జియో మరో ప్లాన్ చేస్తోంది.

మళ్ళీ ఉచితంగా నెట్ ఇవ్వడం లేదు లెండి.

జియోకి ఇన్ని అనుమతులు ఎందుకు అంటూ ఇప్పటికే ట్రాయ్ మీద మిగితా మొబైల్ నెట్వర్క్ కంపెనీలు మండిపడుతున్నాయి.ఉచిత ఆఫర్ ని మళ్ళీ పొడిగించడం కష్టం.

కాని తక్కువ రేటుకే ఇంటర్నెట్ ఇవ్వొచ్చుగా.అదే చేయబోతోందట జియో.

మరో మూడు నెలల వరకు 4G ఇవ్వడం కోసం కేవలం 100 రూపాయలు ఛార్జ్ చేసే ఆలోచనలో ఉందట జియో.ఇంకో మాటలో చెప్పాలంటే, జూన్ వరకు జియో ఇంటర్నెట్ సర్వీసులు పొందాలంటే, ప్రతి వినియోగదారుడు 100 రూపాయలు చెల్లించక తప్పదు అంట.దాంతో ఆఫర్ ని పొడిగించినట్లు కాదు, పూర్తీ ఉచితంగా డేటా ఇస్తున్నట్లు కాదు.మళ్ళీ ట్రాయ్ తో జియో మీద ఫిర్యాదు చేసే అవకాశం మిగితా నెట్వర్క్ కంపెనీలకు దొరకదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube