సుశాంత్ కేసు ఇన్వెస్టిగేషన్ పై సినిమా  

New Movie Planning Based on sushant Death Case, Bollywood CBI, NCB, Rhea Chakraborty, Investigation - Telugu Bollywood Cbi, Investigation, Ncb, New Movie Planning Based On Sushant Death Case, Rhea Chakraborty

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఆత్మహత్య ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలిసిందే.అయితే ఇప్పుడు ఆ ఆత్మహత్యకి గల కారణాలపై విచారణ చేపడుతున్న సీబీఐ అధికారులు విస్తుపోయే నిజాలు బయట పెడుతున్నారు.

TeluguStop.com - New Movie Planning Based On Sushant Death Case

ఆత్మహత్య కోసం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే బాలీవుడ్ లో డ్రగ్స్ మాఫియా డొంక కదిలింది.ఆ డ్రగ్స్ కి సంబందించిన కేసు విచారణ ఎన్సీబీ టేకోవర్ చేసింది.

ఇందులో డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నాయనే ఆధారాలతో రియా చక్రవర్తిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా, లేదంటే ఎవరైనా అతనిని ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేమించారా, లేదంటే ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసారా అనే విషయాలు ఇంకా ఇన్వెస్టిగేషన్ లో బయటకి రాలేదు.

TeluguStop.com - సుశాంత్ కేసు ఇన్వెస్టిగేషన్ పై సినిమా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ కేసును సీబీఐ అన్ని కోణాలలో విచారించి ఛేదించే ప్రయత్నం చేస్తుంది.వీరి దర్యాప్తులో అనేక కొత్త విషయాలు బయటపడుతున్నాయి.వీటినన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఒక సినిమా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.సుశాంత్ సింగ్ రాజపూత్ సూసైడ్ కేసు ఆధారంగా రూపొందిస్తున్నఈ సినిమాకు శరళా సారాగోయీ, రాహుల్ శర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమాకు దిలీప్ గులాటీ దర్శకత్వం వహిస్తున్నారు.అలాగే ఈ చిత్రంలో సుశాంత్ పాత్రను నటుడు జుబైర్ ఖాన్ పోషిస్తున్నారు.

రియాచక్రవర్తి క్యారెక్టర్‌లో శ్రేయా శుక్లా కనిపించనున్నారు.దీనికి ముందు శ్రేయ పలు వెబ్ సిరీస్‌లలో నటించారు.

నటుడు శక్తీ కపూర్ సీబీఐ అధికారిగా కనిపించనున్నారు.ఈ సినిమాకి సంబందించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రాబోతుందని తెలుస్తుంది.

అయితే కేసు విచారణ పూర్తయ్యి నిజానిజాలు బయట పడిన తర్వాత సినిమా తీస్తే దానిపై ప్రేక్షకులు ఆసక్తి చూపించే అవకాశం ఉంది.అలా కాకుండా ఆధారాలే తెలియకుండా ఈ ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి ఆధారాలు దొరికినట్లు చూపిస్తారనేది ఇప్పుడు చాలా మందికి ఉన్న సందేహం.

#NewMovie #Investigation

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

New Movie Planning Based On Sushant Death Case Related Telugu News,Photos/Pics,Images..