ఈ ఫోన్‌ని సబ్బుతో కడిగేయొచ్చంటా!

మోటొరోలా నుంచి ఓ సరికొత్త ఫోన్‌ లాంచ్‌ అయ్యింది.దీన్ని ఎంతో సులభంగా వాడేయొచ్చు.

 New Motorola Defy Waterproof Phone Launched-TeluguStop.com

దీంట్లో ఐపీ 68 రేటింగ్, ఎంఐఎస్‌– ఎస్‌పీఈసీ 810 సర్టిఫికేషన్‌ కూడా ఉంది.ఇంతకీ ఆ ఫోన్‌ మోటొరోలా డిఫై.

ఇందులో ఉండే ప్రధాన ఫీచర్‌ ఏంటంటే ఈ ఫోన్‌ని సబ్బుతో కడిగేసేయొచ్చు, అంటే వాటర్‌ ప్రూఫ్‌ అన్నమాట.ప్రస్తుతం ఇది కేవలం అమెరికా, యూరప్‌లలో నే అందుబాటులో ఉంది.

 New Motorola Defy Waterproof Phone Launched-ఈ ఫోన్‌ని సబ్బుతో కడిగేయొచ్చంటా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందులోనూ ఒక వేరియంట్‌ మాత్రమే ఉంది.ఈ ఫోన్‌ అసలు ధర ఇండియన్‌ రూపీలో రూ.28,700.4 జీబీ ర్యామ్‌ ప్లస్‌ 64 జీబీ స్టోరేజీతో ఫోర్జ్‌డ్‌ గ్రీన్, బ్లాక్‌ రంగుల్లో అందుబాటులో ఉంది.ఈ ఫోన్‌ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ప్రొటెక్షన్‌ కూడా ఉంది.

అంతేకాదు దీన్ని మైక్రో ఎస్డీ కార్డు ద్వారా దాదాపు 512 జీబీ వరకు మోమొరీని పెంచుకోవచ్చు.6.5 అంగుళాల అద్భుతమైన ఫీచర్‌తో హెచ్‌డీ ప్లస్‌ ఐపీఎస్‌ ఎల్సీడీ డిస్ల్సేను అందించారు.662 ప్రాసెసర్‌క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌పై ఈ ఫోన్‌ పని చేయనుంది.స్క్రీన్‌ రిసొల్యూషన్‌ కూడా 720., 1600 పిక్సెల్స్‌తో ఈ మోటొరోలా డిఫైని రూపొందించారు.స్క్రీన్‌ రీఫ్రెష్‌ రేటు కూడా 60 హెర్‌ట్జ్‌గా ఉంది.

ఆండ్రాయిడ్‌ 10 వెర్షన్‌తో ఆపరేటింగ్‌ సీస్టంతో పనిచేయనుంది.ఇంకా దీన్ని 11 కు కూడా అప్‌గ్రేడ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది.డ్యూయల్‌ సిమ్, 4జీ వోల్టే, వైఫై, యూఎస్‌బీ టైప్‌ సీ, ఇందులో డ్యూయల్‌ సూపర్‌ లీనియర్‌ స్పీకర్‌ కూడా ఉంది.ఇంకా ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌తో బ్యాక్‌ కెమెరాలు మూడు ఉంటాయి.

మెయిన్‌ కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్స్, 2 మెగా పిక్సెల్‌ మాక్రో సెన్సార్‌తో పాటు 2 మెగా పిక్సెల్‌ కెమెరా కూడా ఉండనుంది.అంతేకాదు ఈ ఫోన్‌తో సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఫ్రంట్‌ సైడ్‌ 8 మెగా పిక్సెల్స్‌ కెమెరా ఉంది.ఇంకా బ్లూటూత్‌ 5.0, జీపీఎస్, గ్లోనాస్, కేటగరీ 4 వైబ్రేషన్, వెట్‌ ఇంకా «థర్మల్‌ షాక్‌ రాకుండా ఈ ఫోన్‌ను రూపొందించారు.ఐపీ 68 వాటర్‌ రెసిస్టెన్స్, డస్ట్‌ రెసిస్టెన్స్‌ ఫీచర్లు కూడా ఈ ఫోన్‌ సొంతం.దాదాపు 55 డిగ్రీల పైన, –25 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకునే సామర్థ్యం ఈ డిఫై ఫోన్‌కు ఉంది.

#Bluetooth #America #Micro Sd Card #Motrola #Android Ios

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు