అది లేకుండా డ్రైవింగ్ చేస్తే జీవితకాలం "లైసెన్స్"రద్దు!

ద్విచక్రవాహనాలలో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ ఎంతోమంది తమ నిండు ప్రాణాలను పోగొట్టుకున్న సంఘటనలు మనం ఎన్నోచూసి ఉంటాం.కానీ ఇక నుంచి హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ పోలీసులు కంటపడితే మీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది.

 Telangana,  Driving License, Without A Helmet, Central Governament, Motor Vehicl-TeluguStop.com

మొదటిసారిగా హెల్మెట్ లేకుండా పోలీసులకు దొరికితే మూడు నెలల పాటు మీ డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేస్తారు.అలాగే రెండవ సారి కూడా హెల్మెట్ లేకుండా కనిపిస్తే జీవితకాలం పాటు డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది.

అయితే దీనిని ఖచ్చితంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.

హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలను నడుపుతూ ఎంతోమంది వారి ప్రాణాలను కోల్పోతున్నారని, వీటిని అరికట్టడానికి కేంద్రప్రభుత్వం ఈ ఆదేశాలను జారీ చేసింది.

దీని కోసం కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకువచ్చింది.మోటార్ వెహికల్ చట్టం 206 లో సవరణ చేసి ఈ కొత్త చట్టాన్ని తీసుకు వచ్చింది.అయితే ఈ చట్టాన్ని ఇప్పటికే సైబరాబాద్, కర్ణాటక రాష్ట్రాలలో అమలు చేస్తున్నామని ట్రాఫిక్ డిసిపి విజయ్ కుమార్ వెల్లడించారు.

మోటార్ వెహికల్ చట్టం 206 సవరణలో భాగంగా మొత్తం ఎనిమిది కేటగిరీల్లో మార్పులు తీసుకు వచ్చినట్లు అధికారులు తెలియజేస్తున్నారు.

డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, స్పీడ్ గా డ్రైవింగ్ చేయడం, త్రిబుల్ డ్రైవింగ్ చేయడం, రాంగ్ రూట్ డ్రైవింగ్,కేర్ లెస్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్ చేయడం ఇలా మొత్తం 8 కేటగిరీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవలసిందిగా పరిగణించింది.

ఈ ఎనిమిదికేటగిరిలో డ్రైవింగ్ చేస్తున్న వారి వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోతున్నాయని దీనిని కట్టడి చేయడానికే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది.

అయితే ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితంగా అమలు చేయాలని సూచించింది.మరికొద్ది రోజుల్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో పటిష్టంగా చర్యలు చేపట్టనున్నాయి.

ఇకనుంచి ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలి.లేదంటే లైసెన్స్ రద్దయ్యే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube