పిల్లల్లో షుగర్..టెక్సాస్ యూనివర్సిటీ ముందడుగు...!!!

షుగర్ వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తున్న అతిపెద్ద రెండవ వ్యాధిగా షుగర్ అగ్ర స్థానంలో ఉంది.ప్రపంచ వ్యాప్తంగా గుండె పోటుతో చనిపోయే వారి సంఖ్య మొదటి స్థానంలో ఉంటే, షుగర్ ద్వారా చనిపోయే వారి సంఖ్య రెండవ స్థానంలో ఉండటం అందరిలో గుబులు రేపుతోంది.

 New Medicine For Type 2 Diabetes-TeluguStop.com

ఈ వ్యాధి గతంలో పెద్ద వారిలో సుమారు 40 ఏళ్ళు దాటిన వారిలో వస్తూ ఉండేది.కానీ కొన్నేళ్లుగా చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరిని ఈ వ్యాధి కబళిస్తోంది.5, నుంచీ 10 ఏళ్ల లోపు పిల్లలకి , ముఖ్యంగా అప్పుడే పుట్టిన పిల్లలకి కూడా ఈ వ్యాధి సోకడం అందరిలో ఆందోళన కలిగిస్తోంది.

పిల్లల్లో టైప్ 2 షుగర్ ఎక్కువగా కన్పిస్తుంది.

అయితే ఇలాంటి వారికి ఉపశమనం కలిగేలా అమెరికాలోని శాస్తవేత్తలు కొత్త ఔషధాన్ని అభివృద్ధి చేశారు.ఈ ఔషధంపై విజయవంతంగా క్లినికల్‌ ట్రయల్స్‌ కూడా పూర్తి చేశారు.

ఇప్పటి వరకూ అమెరికాలో టైప్ 2 తో బాధపడే పిల్లలకి కేవలం 2 ఔషధాలు మాత్రమే అందుబాటులో ఉండేవి కాని ఇప్పుడు తాజా పరిశోధనతో 3 వ మందు కూడా అందుబాటులోకి వచ్చింది.

ఈ ఔషధంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఈ మందుని కేవలం నోటి ద్వారా తీసుకుంటే సరిపోతుందని ఈ ఔషదం అభివృద్ధి చేసిన టెక్సాస్‌ యూనివర్సిటీకి చెందిన జానేలించ్‌ తెలిపారు.

ఈ ఔషధంతో కొంత మంది పిల్లలపై చేసినటువంటి తుది పరీక్షలు ఎంతో సత్ఫలితాలు ఇచ్చాయని ఆయన తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube