బిగ్‌బాస్‌4: మోనాల్ ఔట్‌.. హారిక‌ను త‌గులుకున్న అభిజిత్‌?  

new love story between abhijeet and harika in bigg boss 4! new love story, abhijeet, harika, bigg boss 4, latest news, bigg boss telugu, - Telugu Abhijeet, Bigg Boss 4, Bigg Boss Telugu, Harika, Latest News, New Love Story

సెప్టెంబ‌ర్ 6న కింగ్ నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ సీజ‌న్ 4 గ్రాండ్‌గా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.మొద‌టి వారం ఇంటి స‌భ్యులు కాస్త త‌డ‌బ‌డినా.

TeluguStop.com - New Love Story Between Abhijeet And Harika In Bigg Boss 4

రెండు, మూడు వారాల్లో అంద‌రూ ఫామ్‌లోకి వ‌చ్చేసి.బిగ్ బాస్ ఇంటిని ర‌స‌వ‌త్త‌రంగా మార్చేశారు.

మొద‌టి వారం ప‌క్క‌న పెడితే.రెండో వారం నుంచి మోనాల్ గజ్జర్, అఖిల్, అభిజిత్‌ల మ‌ధ్య ఏదో జరుగుతుందని.

TeluguStop.com - బిగ్‌బాస్‌4: మోనాల్ ఔట్‌.. హారిక‌ను త‌గులుకున్న అభిజిత్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

వారినే టార్గెట్ చేస్తూ చూపించ‌డంతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు క్యూరియాసిటీతో పాటు ఎంట‌ర్టైన్మెంట్ కూడా బాగానే ల‌భించింది.
మోనాల్ కోసం నువ్వా.

నేనా అన్న రేంజ్‌లో అఖిల్‌, అభిజిత్‌ల మ‌ధ్య ఫైట్ న‌డించింది.అయితే ఇప్పుడు వీరి ల‌వ్ ట్రాక్‌లో కొత్త ట్విస్ట్ చేటుచేసుకుంది.మొద‌ట్లో మొనాల్‌ని విడిచి ఒక్కక్షణం కూడా ఉండలేకయినా అభిజిత్‌.ఇప్పుడు దేత్తడి హారికను త‌గులుకున్నాడు.ప్ర‌స్తుతం అభిజిత్‌కు మోనాల్ దూరం అవుతుంటే.హారిక మెల్ల మెల్ల‌గా ద‌గ్గ‌ర అవుతోంది.

ఇక హారిక కూడా ఎప్పుడు చూసినా.అభిజిత్ వెంట పడుతూనే కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే.నిన్న‌టి ఎపిసోడ్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటుచేసుకుంది.గురువారం ఎపిసోడ్‌లో ఉక్కు హృదయం టాస్క్ ముగిసిన తరువాత మొద‌టిసారి అభిజిత్‌పై వ్యతిరేకత వ్యక్తం చేసింది మోనాల్‌.ఎందుకంటే.

టాస్క్‌లో అభిజిత్ ఆట తీరు న‌చ్చ‌క‌పోవ‌డ‌మే అని చెప్పాలి.అభిజిత్ వ‌ల్ల మోనాల్ ఎంతో ఫీల్ అయింది.

టాస్క్ అనంత‌రం అతనితో మాట్లాడేందుకు కూడా ఆమె ఇష్టపడటం లేదు.
ఈ క్ర‌మంలోనే అభి ఉన్నచోట తాను ఉండలేనని.

అతడు రేషన్ మేనేజర్‌గా ఉన్నాడు కాబట్టి తాను కిచెన్‌లో చేయనని తేల్చి చెప్పింది మోనాల్‌.దీంతో నోయ‌ల్ మోనాల్‌కు ఏదో విధంగా సర్ధిచెప్పాడు.

మ‌రోవైపు టాస్క్ పూర్తి అయిన త‌ర్వాత చేయి చేయి క‌లుపుకుని మ‌రీ ముచ్చ‌ట్లు పెట్టారు హారక‌, ‌అభిజిత్.ఈ క్ర‌మంలోనే నువ్ చాలా బాగా ఆడావ్.

నువ్ సూపర్ అంటూ అభిజిత్‌ను ఆకాశానికి ఎత్తేసింది హారిక‌.దీంతో వీరి మ‌ధ్య ఏదో న‌డుస్తుందంటూ ప్ర‌చారం ఊపందుకుంది.

#New Love Story #Bigg Boss 4 #Abhijeet #Harika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

New Love Story Between Abhijeet And Harika In Bigg Boss 4 Related Telugu News,Photos/Pics,Images..