ప్రతిభావంతులను ఆకర్షించే ప్లాన్.. త్వరలో ‘‘స్టార్టప్ వీసా’’ను ఇవ్వనున్న అమెరికా

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లేవారికి అమెరికాయే తొలి డెస్టినేషన్.అలా దశాబ్ధాలుగా ఎన్నో జాతులు, వర్గాలు, మతాల వారిని అక్కున చేర్చుకుంది అమెరికా.

 New Legislation Supported By Joe Biden Proposes Startup Visas To Attract Talent , Joe Biden, Canada, Australia, Uk, Americans, Indians, Green Card, W-2, Startup‌ Visa, Science‌, Technology, Engineering‌, Maths‌-TeluguStop.com

తనపర బేధాలు లేకుండా అందరికీ ఆశ్రయం కల్పించింది.జీవన ప్రమాణాలు, ఆరోగ్య వసతులు, ఉపాధి, విద్య ఇలా అన్నింట్లో మెరుగ్గా వుండటంతో వివిధ దేశాల ప్రజలకు అమెరికా అంటే వ్యామోహం నానాటికీ పెరుగుతోంది.

అన్ని రకాలుగా ప్రోత్సాహం లభించడంతో పాటు అగ్రరాజ్యంలోని అత్యున్నత పదవులను విదేశీ పౌరులు చేజిక్కించుకుంటున్నారు.

 New Legislation Supported By Joe Biden Proposes Startup Visas To Attract Talent , Joe Biden, Canada, Australia, UK, Americans, Indians, Green Card, W-2, Startup‌ Visa, Science‌, Technology, Engineering‌, Maths‌-ప్రతిభావంతులను ఆకర్షించే ప్లాన్.. త్వరలో ‘‘స్టార్టప్ వీసా’’ను ఇవ్వనున్న అమెరికా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సమర్ధత, మేధస్సు, అనుభవం వుంటే చాలు అమెరికన్లు అందలమెక్కిస్తున్నారు.

ఇందుకు ఎన్నో ఉదాహరణలు.భారతీయులు, చైనీయులు, కొరియన్లు, జపనీయులు, ఆఫ్రికా ఖండాల వారు అక్కడ రాణిస్తున్నారు.

ఇక భారతీయులను అమెరికన్లు ఎంతగానో ప్రేమిస్తారు.కష్టాల్లో వున్న మనవారిని ఎందరో ఆదుకున్నారు.

మన భారతీయ పద్ధతులను, సంస్కృతులను అమెరికన్లు బాగా పాటిస్తున్నారు.ఇటీవలి కాలంలో అమెరికన్లు, భారతీయుల మధ్య అనుబంధం దృఢ పడుతోంది.

ఇప్పటికే అగ్రరాజ్యంలో ఎన్నో రంగాల్లో భారతీయులు కీలక స్థానాల్లో వున్నారు.రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా.

మరోవైపు కాలం చెల్లిన వీసా విధానం కారణంగా అమెరికాకు రావాల్సిన ప్రతిభ.కెనడా, ఆస్ట్రేలియా, యూకే ఇతర యూరప్ దేశాల వైపు ఆకర్షితులవుతున్నట్లు ఇమ్మిగ్రేషన్ విధాన నిపుణులు అమెరికా చట్టసభ సభ్యులను హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్, శాశ్వత నివాసం జారీ చేయడానికి అమల్లో వున్న కంట్రీ క్యాప్ విధానం ఇందుకు ప్రధాన కారణమని వారు తెలిపారు.అలాగే ఇప్పటికే అమెరికాలో వున్న ప్రతిభావంతులు ఇతర దేశాలకు తరలి వెళ్లకుండా నిరోధించడానికి కాంగ్రెస్ మరింత వేగంగా పనిచేయాలని నిపుణులు విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం నిద్రలేచింది.ప్రపంచం నలుమూలల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించేందుకు కొత్తగా ‘‘స్టార్టప్‌ వీసా’’ను తీసుకురానుంది.అమెరికా కంపీట్స్‌ యాక్ట్‌లో భాగంగా ఈ వీసాను తెస్తున్నారు.దీనికి సంబంధించిన బిల్లును అమెరికా కాంగ్రెస్‌లో మంగళవారం ప్రవేశపెట్టారు.దీని ప్రకారం.అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో స్టార్టప్‌లు పెట్టేవారికి ‘డబ్ల్యూ -1’, వారు రిక్రూట్ చేసుకునే ఉద్యోగులకు ‘డబ్ల్యూ-2’ అనే పేరిట వీసాలు మంజూరు చేస్తారు.

స్థాపించే కంపెనీని బట్టి ఎంతమంది ఉద్యోగులనైనా తెచ్చుకోవచ్చని చట్టసభ సభ్యులు అంటున్నారు.అయితే వారు అమెరికాలోని పరిశోధనా సంస్థల్లో లేదా తత్సమానమైన సంస్థలో సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌లో (STEM) డాక్టోరల్‌ డిగ్రీ చేసి ఉండాలి.

New legislation supported by Joe Biden proposes startup visas

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube