బిపిన్ రావత్‌కు నివాళులు అర్పించిన సాయి దత్త పీఠం

న్యూ జెర్సీ: ఎడిసన్::డిసెంబర్:10 హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌కు న్యూజెర్సీలో సాయి దత్త పీఠం నివాళులు అర్పించింది.న్యూజెర్సీ ఎడిసన్‌లో శ్రీ శివ, విష్ణు ఆలయంలో బిపిన్ రావత్ చిత్రపటం ముందు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించింది.

 Sai Datta Peetham Condolences To Bipin Rawat, Bipin Rawat, Army Helicopter Crash-TeluguStop.com

బిపిన్ రావత్ తో పాటు గా సైన్యం లో సేవలందించిన కల్నల్ (రిటైర్డ్ ) వీరేంద్ర ఎస్ తవాతియా, రావత్ తో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు.వీర సైనికులకు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు.

ఈ సందర్భంగా సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి, న్యూ జెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ చైర్మన్ ఉపేంద్ర చివుకుల, మాతా రాజ్యలక్ష్మి (స్పిరిట్యుయల్ గురు, కమ్యూనిటీ లీడర్), సాయి దత్త పీఠం బోర్డు సభ్యులు, ఆలయ భక్తులు, మాతృభూమి కోసం బిపిన్ రావత్ చేసిన సేవలను గుర్తు చేశారు.హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్‌, వారి సతీమణి మధులిక తో పాటు మిగిలిన సైనికులకు కూడా అందరూ నివాళులు అర్పించారు.

బిపిన్ రావత్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు రఘు శర్మ శంకరమంచి తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube