అమెరికాలో ఆ వ్యక్తికి..190 ఏళ్ల జైలు శిక్ష..!  

  • అమెరికాలో ఓ వ్యక్తికి అక్కడి న్యాయ స్థానం ఏకంగా 190 ఏళ్ల జైలు శిక్షని విధిస్తూ తీరుపుని చెప్పింది. ఈ శిక్ష కాలపరిమితి విన్న అమెరికన్లు ఆశ్చర్య పోయారు. అన్నేళ్ల జైలు శిక్షా?? అసేలేమి అతడు ఏమి చేశాడు అంటూ ఆరా తీశారు. అతడు చేసిన ఘోరమైన చర్యలు వింటేనే భయాన్ని గొల్పుతుంది. ఆ వివరాలలోకి వెళ్తే

  • న్యూజెర్సీ లోని ఈస్ట్ ఆరెంజ్ ప్రాంతానికి చెందిన జెఫ్రీ హోలాండ్ 2016 లో తన మాజీ ప్రియురాలిని, ఆమె నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ లో అత్యంత దారుణంగా హత్య చేశాడు. వెంటనే ఆ తరువాతి రోజు మరో ప్రియురాలు ఆమె ప్రియుడిని కూడా తుపాకీ తో కాల్చి చంపేశాడు.ఆ సమయంలో అక్కడ ముగ్గురు చిన్నారులు ఉండగా వాళ్ల కళ్ల ముందే ఈ దారుణానికి ఒడిగట్టాడు.

  • New Jersey Man Sentenced To 190 Years For Grisly Triple Murder-Grisly Murder

    New Jersey Man Sentenced To 190 Years For Grisly Triple Murder

  • అయితే ఈ కేసుకు సంభందించి 2018 లో పోలీసుల ముందు లొంగిపోయాడు అయితే ఈ కేసుల విచారణ నిమ్మిత్తం విచారణ చేపట్టిన కోర్టు ముగ్గురి హత్యలకు గాను 60 ఏళ్ల చప్పున మొత్తం 180 ఏళ్ళు, ఆయుధాలు కలిగి ఉన్నాడు అనే కారణంగా మరి పదేళ్ళు మొత్తం 190 ఏళ్ళు జైలు శిక్షని విధించింది ఈ కేసు తుది తీర్పుని తాజాగా వెల్లడించింది.