దళిత బంధుతో టీఆర్ఎస్ కు కొత్త చిక్కులు

టీఆర్ఎస్ ప్రభుత్వం జనారంజాక పధకాలకు పెట్టింది పేరు అన్న విషయం తెలిసిందే.తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పధకాలను ఇతర రాష్ట్రాలు సైతం ఆదర్శంగా తీసుకొని వారి వారి రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితిని బట్టి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

 New Implications For Trs With Dalit Relative Scheme, Trs Party,kcr, Dalithbandhu-TeluguStop.com

అయితే ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పధకం ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్శిస్తోంది.అదే దళిత బంధు పధకం.

అయితే ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కులాల ప్రస్తావన రాకుండా అన్ని వర్గాలకు తగ్గట్టు కులాల ఆధారంగా కాకుండా వృత్తుల ఆధారంగానో, లేక వివిధ రూపాలుగా పధకాలను ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది.అయితే దళిత బంధు ప్రకటనతో మిగతా కులాల వారు కూడా మాకు కూడా బంధు పధకం ప్రకటించాలని నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

అయితే కెసీఆర్ కూడా అన్ని కులాల వారికి కూడా న్యాయం చేస్తామని తెలిపారు.కాని ఇక్కడే టీఆర్ఎస్ కు కొత్త చిక్కులు వస్తున్న పరిస్థితి ఉంది.

అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాల వారికి ఈ బంధు పధకం వర్తింప జేయడం సాధ్యమవుతుందా అన్నది ఒక అనుమానం రాజకీయ విశ్లేషకుల్లో కనిపిస్తోంది.ఒక వేళ మిగతా కులాలు ఆగ్రహం వ్యక్తం చేస్తే టీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికలలో కొంత ఎదురుదెబ్బ తగిలే అవకాశం లేకపోలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube