సీనియ‌ర్ల‌తో టీడీపీకి కొత్త చిక్కులు.. అస‌లేం జ‌రుగుతోంది..?

ఏపీలో టీడీపీ ప‌రిస్థితి రోజురోజుకు దిగ‌జారిపోతున్న‌ట్టు క‌నిపిస్తోంది.ఇప్ప అస‌లు పార్టీ పుంజుకునే ప‌రిస్థితి మాత్రం క‌నిపించ‌ట్లేదు.

 New Implications For Tdp With Seniors What Is Actually Happening-TeluguStop.com

దీనికి తోడు సొంత పార్టీ నేత‌ల నుంచే చంద్ర‌బాబుకు కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి.ఇప్ప‌టికే చాలామంది రెబ‌ల్స్ రూపంలో బెదిరిస్తుండ‌గా వారిని బుజ్జ‌గించ‌డంతోనే చంద్ర‌బాబుకు స‌రిపోతుంది.

ఎలాగైనా మళ్లీ అధికారం ద‌క్కించుకునేందుకు చంద్ర‌బాబు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నా కూడా అందుకు చాలా స‌వాళ్లు పార్టీ నేత‌ల నుంచే వ‌స్తున్నాయి.దీంతో ఆయ‌న‌కు ఏం చేయాలో అర్థం కావ‌ట్లేదు.

 New Implications For Tdp With Seniors What Is Actually Happening-సీనియ‌ర్ల‌తో టీడీపీకి కొత్త చిక్కులు.. అస‌లేం జ‌రుగుతోంది..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక‌పోతే ఇప్పుడు చంద్ర‌బాబుకు సీనియ‌ర్ నేత‌ల నుంచే మ‌రో చిక్కులు వ‌చ్చిప‌డుతున్నాయి.టీడీపీలో ఎప్ప‌టి నుంచో ఉన్న సీనియర్ నేతలు అంతా కూడా మూకుమ్మడి దాడికి రెడీ అవుతున్నారు.

ఇప్ప‌టికే ఒక్కక్కొరుగా టీడీపీకి హ్యాండ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.దీంతో ఈ విష‌యం ఇప్పుడు చంద్ర‌బాబుకు ఆందోళన కలిగిస్తోంది.

చాలా మంది సీనియ‌ర్లు టీడీపీ నుంచి దూరుంగా ఉంటూనే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నార‌ని తెలుస్తోంది.మొన్న‌టి వ‌ర‌కు పార్టీలో వారే కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.

ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో వారు చెప్పిందే శాసనంలా ఉండేది.

Telugu Ap Poltics, Chandrababu, Nara Lokesh, Tdp, Tdp Seniors, Ys Jagan, Ysr Cp-Telugu Political News

దాంతో చంద్ర‌బాబు కూడా కొత్త నాయ‌కులను ప‌క్క‌న పెట్టారు.కానీ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు వీరు పెద్ద‌గా పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌లేదు.అప్ప‌టి నుంచే వారు దూరం కావ‌డం మొద‌లు పెట్టారు.

ఇప్పుడేమో ఏకంగా రాజ కీయాల‌నుంచే త‌ప్పుకుంటున్నారు.దీంతో పార్టీలో ప్రమాదకరమైన సంకేతాలు వినిపిస్తున్నాయి.

వీరంతా చంద్ర‌బాబు నాయ‌క‌త్వంపై న‌మ్మ‌కం లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే ఈ నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.పత్తికొండ, అనంతపురం, చిత్తూరు లాంటి జిల్లాల్లో ఇప్పుడు ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

సీనియ‌ర్లు త‌ప్పుకున్నా వారి వార‌సులును నిల‌బెడుతున్నారు.కానీ వారు మాత్రం గ‌త ఎన్నిక‌ల్లో దారుణంగా ఓడిపోయారు.

దీంతో ఇప్పుడు త‌ప్పుకుంటున్న సీనియ‌ర్లు అయితే వారి వార‌సుల‌ను కూడాపోటీ చేయ‌నివ్వ‌ట్లేదు.

#YSR CP #TDP Seniors #Lokesh #AP Poltics #YS Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు