కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు.. సురేఖ‌తో ద‌ర‌ఖాస్తు చేయిస్తారా..?

తెలంగాణలో ఇప్పుడు జ‌రుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్‌, బీజేపీ పార్టీలు దూసుకుపోతున్నాయి.వ‌రుస పెట్టి స‌మావేశాలు, స‌భ‌లు, ప్రచారాల‌తో హోరెత్తిస్తున్నారు.

 New Implications For Congress Will You Apply With Surekha , Konda Surekha, Congr-TeluguStop.com

కానీ తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ మాత్రం ఇంచు కూడా క‌ద‌ల‌ట్లేదు.క‌నీసం క్యాండిడేట్ ను కూడా డిసైడ్ చేసుకోలేక నానా ఇబ్బందులు ప‌డుతోంది.

ఇప్ప‌టికే చాలామంది పేర్లు తెర‌మీద‌కు వ‌చ్చినా కూడా వ‌రెవ‌రూ కూడా ఫైన‌ల్ కాలేదు.ఇక మాజీ మంత్రి కొండా సురేఖ పేరు బ‌లంగా వినిపిస్తున్నా కూడా ఆమెకు నేరుగా టికెట్ ఇవ్వ‌కుండా ఆసక్తి ఉన్న నేతలను దరఖాస్తు చేసుకోమన్నారు.

ఇక్క‌డే కాంగ్రెస్‌కు అస‌లు చిక్కులు వ‌చ్చి ప‌డుతున్నాయి.అవేంటంటే దరఖాస్తులు చేసుకోవ‌డానికి ఇచ్చిన గడువు మొన్నటి ఆదివారంతో ముగిసినా ఇందులో కొండా సురేఖ మాత్రం ద‌ర‌ఖాస్తు లేదు.

కాగా మొత్తం 18 ద‌ర‌ఖాస్తులు రాగా ఇందులో 11 వ‌ర‌కు హుజూరాబాద్ నియోజకవర్గానికి కాగా మిగ‌తావి ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన నేతలవి.ఇక ద‌ర‌ఖాస్తు చేస‌కున్న వారిలో ఒక్కరు కూడా ఇప్ప‌డు ఉపఎన్నికల్లో టీఆర్ ఎస్‌, బీజేపీల‌కు గట్టిపోటీ ఇచ్చేంత స్థాయి ఉన్న వారు లేరు.

దీంతో వీటిని కాంగ్రెస్ ఫైన‌ల్ చేయ‌లేక‌పోతోంది.

Telugu Congress, Konda Surekha, Congressapply-Telugu Political News

ఇక దరఖాస్తుల విష‌యాన్ని ఏ విధంగాను కొండా సురేఖ సీరియ‌స్ గా తీసుకోలేద‌ని తెలుస్తోంది.నేరుగా టికెట్ ఇస్తే అది కూడా ష‌ర‌తుల మీద ఓకే చెప్పే అవ‌కాశం ఉంది.ఇక్క‌డే కాంగ్రెస్‌కు ఏం చేయాలో అర్థం కావ‌ట్లేదు.

ఎందుకంటే ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారిని కాద‌ని సురేఖ‌కు టికెట్ ఇస్తే అదో పెద్ద సమస్యగా అవుతుంది.అలాంట‌ప్పుడు త‌మ‌తో ఎందుకు ద‌ర‌ఖాస్తులు చేయించార‌ని మండిప‌డుతారు.

అంతే కాదు తమ దగ్గర డబ్బులు వ‌సూలు చేసేందుకు ఇలాంటి పెట్టారిన ఆరోపణలు చేస్తారు.ఈ నేప‌థ్యంలో దరఖాస్తు గడువు పెంచేసి అప్పుడు ఎలాగోలా సురేఖ‌ను ఒప్పించి దరఖాస్తు చేయించాల‌నే ఆలోచనలో సీనియర్ నేతలున్నట్లు స‌మాచారం.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube