దళిత బంధుకు బ్రేక్ తో బీజేపీకి కొత్త చిక్కులు

తెలంగాణ రాజకీయాలు ఎన్నడూ లేనంతగా రోజుకో ట్విస్టుతో వేడెక్కుతున్న పరిస్థితి ఉంది.రోజు రోజుకు పోలింగ్ కు గడువు దగ్గర పడుతున్న తరుణంలో గెలుపే లక్ష్యంగా పార్టీలు ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.

 New Implications For Bjp With Break To Dalit Bandh Trs Party, Kcr , Ts Potics ,-TeluguStop.com

ఇప్పటికే పార్టీలు గెలుపుకు సంబంధించిన వ్యూహ,ప్రతి వ్యూహాలను పన్నడంలో నిమగ్నమయిన పరిస్థితి ఉంది.ఎందుకంటే హుజూరాబాద్ లో గెలుపొందడం అన్నది ఇప్పుడు అందరికీ చాలా ప్రతిష్టాత్మకంగా మారిన పరిస్థితి ఉంది.

ప్రస్తుతం కెసీఆర్ పై కొన్ని వర్గాలు అగ్రహంగా ఉన్న పరిస్థితి ఉంది.ముఖ్యంగా నిరుద్యోగులు ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేయడం లేదని కెసీఆర్ పై అగ్రహంగా ఉన్న పరిస్థితులలో ఈ ఎన్నికలో కెసీఆర్ ను ఓడించి ఎంతో కొంత ఒత్తిడి పెంచాలన్నది నిరుద్యోగుల ఆలోచన.

అందుకే ఇప్పుడు కెసీఆర్ పై ఉన్న ఆగ్రహంతో ప్రతిపక్షాలకు మద్దతు తెలుపుతున్న పరిస్థితి ఉంది.

ఇది ఇలా ఉంటే ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన దళితబంధు పధకంపై టీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఉంది.

అయితే ఇప్పటికే కొంత మంది లబ్ధిదారులకు ఈ పధకం ద్వారా లబ్ధి జరిగినా మెజారిటీ దళితులకు ఇంకా అందలేదు.మరికొద్ది రోజులలో అందరికీ అందుతుందనుకున్న దశలో కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది.

Telugu @bandisanjay_bjp, @bjp4telangana, Bandi Sanjay, Bjp, Dalitha Bandu, Etala

దళిత బంధు పధకాన్ని నిలిపివేయాలంటూ తాజాగా ఆదేశాలిచ్చిన విషయం విదితమే.అయితే బీజేపీ నేతలు రాసిన లేఖల వల్లే దళిత బంధు పధకం ఆగిపోయిందని టీఆర్ఎస్ నేతలు యాంటీ దళిత్ బీజేపీ పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పరిస్థితి ఉంది.దీంతో ఇప్పడు బీజేపీ దళిత వ్యతిరేకి అన్న పేరు బలంగా పడాలన్న వ్యూహంతో టీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున ఈ అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకుంటోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube