ప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు.కొంతమంది హీరోయిన్లకు ఇప్పటికే ఇతర భాషల్లో గుర్తింపు ఉన్నా ఈ ఏడాది తెలుగు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావడానికి ఈ హీరోయిన్లు ప్రయత్నించారు.
అయితే ఈ ఏడాది ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్లలో ఎక్కువమంది హీరోయిన్లు ఇతర భాషల హీరోయిన్లు కావడం హాట్ టాపిక్ అవుతోంది.
ఆర్.
ఆర్.ఆర్ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే.హిందీ హీరోయిన్ అయినప్పటికీ తన నటనతో అలియా భట్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తర్వాత అలియా భట్ కు టాలీవుడ్ మూవీ ఆఫర్లు వచ్చినా వరుసగా సినిమాలతో బిజీగా ఉండటంతో పాటు వ్యక్తిగత కారణాల వల్ల ఆమె టాలీవుడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
లైగర్ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటించగా ఈ హీరోయిన్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించాలని ప్రయత్నించినా ఆమె నటనకు మంచి మార్కులు పడలేదు.సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకున్నారు.సీతగా ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు.ఓరి దేవుడా సినిమాతో మిథిలా పాల్కర్, కృష్ణ వ్రింద విహారి సినిమాతో షిర్లే సేటియా ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
అంటే సుందరానికి సినిమాతో నజ్రియా, భీమ్లా నాయక్ సినిమాతో సంయుక్త మీనన్, రామారావ్ ఆన్ డ్యూటీ మూవీతో రజీషా విజయన్, గాడ్సే మూవీతో ఐశ్వర్య లక్ష్మీ, హైవే మూవీతో మానస, నేను మీకు బాగా కావాల్సినవాడిని మూవీతో సోను ఠాకూర్, సంజన ఆనంద్ అల్లూరి మూవీతో కయాదు లోహార్, ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీతో సంచిత బసు ఆకట్టుకున్నారు.అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాలో రితియా నాయక్ నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.