విమర్శలను తిప్పికొట్టలేకపోతున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. ఈసారి విజయం వరించేనా.. ?

ఈసారి తెలంగాణాలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఉత్కంఠంగా సాగనుందని తెలుస్తుంది.ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారుతోంది అంటున్నారు విశ్లేషకులు.

 New Headache To Palla Rajeshwar Reddy On Mlc Election Fight-TeluguStop.com

కాగా ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగుతున్నారు.ఇకపోతే తాజా పరిస్దితులను బట్టి చూస్తే.

పల్లా రాజేశ్వర్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మూడు జిల్లాల మంత్రులు రంగంలోకి దిగారట.దీనికి కారణం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఇప్పటివరకు స్పష్టత లేకపోవడం.

 New Headache To Palla Rajeshwar Reddy On Mlc Election Fight-విమర్శలను తిప్పికొట్టలేకపోతున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. ఈసారి విజయం వరించేనా.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనికి తోడు సోషల్ మీడియా వేదికగా పల్లాకు వ్యతిరేకంగా జరుగుతోన్న ప్రచారంతో టీఆర్ఎస్ శ్రేణులు సైతం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట.

అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాములు నాయక్ మొదలుకుని, ప్రొఫెసర్ కోదండరాం, చెరుకు సుధాకర్, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న తదితర సోషల్ మీడియా అనుచర వర్గమంతా పల్లాపై దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇలా ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా దాడి చేస్తున్న నేపధ్యంలో పల్లా విజయం అనుమానమే అనే టాక్ నడుసుందట.

ఇక విమర్శలను తిప్పికొట్టలేకపోతున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించడానికి మంత్రులు స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారట.

ఇచ్చిన హామీలు సరిగా నెరవేరిస్తే ఇప్పుడు ఇలా టెన్షన్ పడవలసిన అవసరం ఉండదుగా అని అనుకుంటున్నారట ఓటర్లు.

#MLC Election #Fight #New Headache #PallaRajeshwar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు