హెచ్-1బీ లాటరీ విధానంలో భారీ మార్పు..

హెచ్-1బీ.వీసా జారీలో ముందు నుంచి అత్యంత కఠిన వైఖరిని అవలంబిస్తున్న అమెరికా, తాజాగా హెచ్-1బీ జారీ విషయంలో భవిష్యత్తులో మరింత తీవ్రమైన నిబంధనలను పాటించాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

 New H 1b Visa Lottery Process May Hit Immigrants-TeluguStop.com

అదేంటంటే ప్రస్తుతం ఉన్న లాటరీ విధానంలో కీలక మార్పులు తీసుకురావాలని యోచిస్తున్నట్లుగా ఇమ్మిగ్రేషన్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది.గతంలో లాటరీ విధానంతో ప్రవేశాలు పొందాలంటే తగినన్ని ఆధారాలు ఉంటే సరిపోయేవి కానీ ఇప్పుడు సరికొత్త మార్పుల వలన…

పాత విధానాలతోపాటు ముందస్తు నమోదు ప్రక్రియ తప్పకుండా ఉండేలాగా చట్టం చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ విధానం వల్ల వీసా జారీ ప్రక్రియ మరింత విస్తృతం కానుందని నిర్వహణ ఖర్చు కూడా తగ్గుతుందని తెలిపింది ఈ మేరకు అమెరికా అధికారి కార్యాలయం నుంచి కూడా అనుమతులు లభించాయని అధికారులు తెలిపారు.అయితే ఈ ప్రక్రియ వలన అమెరికాలో ఉద్యోగం చేసేవారికి మాత్రం తిప్పలు తప్పవని చెప్పాలి

అమెరికాలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రతియేటా 65 వేల మందికి ఇమ్మిగ్రేషన్ హెచ్-1బీ వీసా లను జారీ చేస్తుంది అంతేకాకుండా విద్యనభ్యసించడానికి వచ్చే వారి కోసం 20000 వీసాలు జారీ చేస్తోంది.

అయితే కేవలం ఒక్క ఈ సంవత్సర కాలంలోనే లక్ష 90 వేల వీసా దరఖాస్తులు అందాయని వారిలో 60 శాతం పైగా భారతీయులు ఉన్నారని అధికారులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube