భారత్ వచ్చే ఎన్నారైలకు కొత్త మార్గదర్శకాలు...

కరోనా మహమ్మారి కారణంగా వివిధ దేశాలకు వలసలు వెళ్ళిన ప్రవాసీయులు ఎంతో మంది కుటుంభాలతో సహా భారత్ లోని తమ ప్రాంతాలకు వచ్చేశారు.పరాయి దేశంలో ఉండలేమని తమని భారత్ తీసుకుపోమని ఎన్నారైలు భారత ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకోవడంతో విడతల వారీగా ఎన్నారైలను ప్రభుత్వం తీసుకువచ్చింది.

 New Guidelines For Nris Coming To India, Nris, India, Corona,  Rt Pcr Test , Suv-TeluguStop.com

కరోనా తగ్గు ముఖం పట్టిన తరువాత కొందరు మళ్ళీ ఆయా దేశాలకు వెళ్ళిపోయారు.కానీ ఇప్పుడు కొత్త రకం కరోనా మహమ్మారి ఇండియాని కూడా తాకడంతో ఇకపై భారత్ వచ్చే ప్రవాసీయులు, ప్రయాణీకుల పై కొత్త మార్గదర్సకాలు విడుదల చేసింది.

భారత ప్రభుత్వం విడుదల చేసిన ఈ మార్గాదర్సకాలు ఈ నెల 23 నుంచీ అమలులోకి వచ్చాయి.తాజా నిభంధనల ప్రకారం విదేశాల నుంచీ వచ్చే ప్రయాణీకులు ఎవరైనా సరే వారికి అక్కడ 72 గంటల ముందే ఇచ్చిన కరోనా ఆర్టీ పీసిఆర్ టెస్ట్ నెగిటివ్ రిపోర్ట్ ను ఎయిర్ సువిధా పోర్టల్ లో అప్లోడ్ చేయించాల్సి ఉంటుంది.

అక్కడ చేసే ధర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ లో కరోనా లక్షణాలు లేకపోతేనే విమానం ఎక్కేందుకు అనుమతి ఉంటుంది.అంతేకాదు భారత్ లో దిగిన తరువాత తప్పకుండా మరొక్క సారి కరోనా ఆర్టీ పీసిఆర్ టెస్ట్ ను తమ సొంత ఖర్చులతో ప్రయాణీకులు చేయించుకోవాలి.

కానీ ప్రభుత్వం విధించిన ఈ తాజా నిభందనలు విదేశాల వస్తున్న వారికి అసంతృప్తిని కలిగిస్తున్నాయి.ఎందుకంటే విదేశాలలో కరోనా కారణంగా ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న తమకు అక్కడ కరోనా పరీక్షలు చేయించుకోవడానికి ఎంతో ఖర్చు అయ్యిందని, మళ్ళీ సొంత ఖర్చులతో సొంత దేశం వచ్చిన తరువాత కూడా చేయించుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఒక్క నిభందన సడలించాలని కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రవాస్ సంఘాలు సైతం వినతులు ఇస్తున్నాయి.అయితే కేవలం కేరళ రాష్ట్రం మాత్రమే తమ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఈ టెస్ట్ లు చేపడుతామని ప్రకటించింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube