సినిమాపై తగ్గించారు...కానీ సిమెంట్ పై జీఎస్టీ తగ్గించకపోవడానికి కారణం ఏంటో తెలుసా.?

జీఎస్‌టీ.గ‌తేడాది జూలై 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా అమ‌లులోకి వ‌చ్చింది.

 New Gst Rates Out Cement Auto Parts Still In Highest Slab-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే అనేక ర‌కాల వ‌స్తువులు, సేవ‌ల‌ను ప‌లు శ్లాబుల్లో చేర్చి వాటికి జీఎస్టీ విధిస్తూ వ‌స్తున్నారు.కాగా ఇటీవ‌లి కాలంలో ప‌లు జీఎస్‌టీ వ‌స్తువుల శ్లాబుల‌ను మార్చ‌గా కొన్నింటిని మాత్రం జీఎస్‌టీ నుంచి తీసేశారు.

అయితే ఇప్పుడు ఈ జీఎస్‌టీ శ్లాబుల్లో సరికొత్త మార్పు తీసుకొచ్చారు.టీవీలు, కంప్యూట‌ర్లపై ప‌న్ను శాతాన్ని త‌గ్గించారు.

సిమెంటు, ఆటో పార్ట్స్‌పై జీఎస్టీని త‌గ్గించ‌లేదు.

ఈ విష‌యాన్ని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వెల్ల‌డించారు.కేవ‌లం విలాస‌వంత‌మైన వ‌స్తువులు మాత్ర‌మే 28 శాతం ప‌న్ను శ్లాబులో ఉంటాయ‌ని మంత్రి తెలిపారు.గత ఏడాది జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చినప్పుడు 28 శాతం గరిష్ఠ శ్లాబ్‌లో 226 వస్తువులు ఉండేవి.

ఇప్పుడు, పొగాకు ఉత్పత్తులు, ఆటోమొబైల్స్‌, రివాల్వర్లు, పిస్టళ్లు వంటి 28 లగ్జరీ వస్తువులు మాత్రమే ఇందులో కొనసాగుతున్నాయి.రూ.100పైన సినిమా టికెట్లపై 28% జీఎస్టీని 18 శాతానికి; వందలోపు టికెట్లపై 18% జీఎస్టీని 12 శాతానికి తగ్గించారు.

ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాకు రూ.900 కోట్ల ఆదాయం తగ్గుతుందని జైట్లీ చెప్పారు.సిమెంట్‌, ఆటోమొబైల్‌ భాగాలపై జీఎస్టీని తగ్గించలేమని, వాటిని 18 శాతానికి మారిస్తే, రూ.33 వేల కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుందని వివరించారు.జ‌న‌వ‌రి ఒక‌టి, 2019 నుంచి కొత్త జీఎస్టీ అమ‌లులోకి వ‌స్తుంద‌ని మంత్రి చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube