జ‌గ‌న్ ఢిల్లీ టూర్‌పై కొత్త గుస‌గుస‌లు… ఏది నిజం..!  

new gossips on jagan delhi tour,andhra pradesh,chief minister,jagan mohan reddy, delhi tour,central minister,amith shah,rajya sabha ticket - Telugu Amith Shah, Andhra Pradesh, Central Minister, Chief Minister, Delhi Tour, Jagan Mohan Reddy, Rajya Sabha Ticket

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌.ఢిల్లీ టూర్‌కు వెళ్లారు.అయితే, చిత్రంగా ఆయ‌న ఎప్పుడు హ‌స్తిన‌కు వెళ్లినా.దీనిపై పెద్ద ఎత్తున విప‌రీత క‌థ‌నాలు వ‌స్తుంటాయి.బాబు అనుకూల వ‌ర్గంగా ఉన్న స‌మాచార వ్య‌వ‌స్థ అంతా కూడా.ఇంకేముంది.

TeluguStop.com - New Gossips On Jagan Delhi Tour

జ‌గ‌న్‌ను త‌లంటేయ‌డానికే పిలిచారు.అంటూ క‌థ‌నాలు అల్లేస్తుంది.

అదే స‌మ‌యంలో.జ‌గ‌న్‌కు అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌డంలోనూ జాప్యం చేసి.

TeluguStop.com - జ‌గ‌న్ ఢిల్లీ టూర్‌పై కొత్త గుస‌గుస‌లు… ఏది నిజం..-Political-Telugu Tollywood Photo Image

నైతికంగా శిక్షించారంటూ.కూడా క‌థ‌లు రాసేస్తుంది.

వాళ్లు అలా అన్నారు.ఇలా స‌మాచారం వ‌చ్చింది.

తెలిసింది.అంటూ.

క‌థ‌నాల‌ను వండి వార్చ‌డంలో ముందుంటుంది.
అయితే, వాస్త‌వానికి ఢిల్లీ లో జ‌రిగేది మ‌రొక‌టి! అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చే స‌రికి కొంత స‌మ‌యం ప‌డుతుంది.

అప్పుడు నిజంగానే అంద‌రూ ముక్కున వేలేసుకుంటారు.మూడు రాజ‌ధానుల నిర్ణ‌యం.ఎంపీల కోటాలో ‌న‌త్వానీకి అవ‌కాశం ఇవ్వ‌డం, విశాఖ‌కు పాల‌న రాజ‌ధాని త‌ర‌లింపు వంటివి గ‌తంలో ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో జ‌రిగిన చ‌ర్చ‌లు.ఇక‌, ఇప్పుడు మ‌రోసారి అనూహ్యంగా జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు.

అయితే, దీనిపై కూడా.బాబు అనుకూల స‌మాచార వ్య‌వ‌స్త‌.

భారీ ఎత్తున క‌థ‌నాలు రాసేసింది.

జ‌గ‌న్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షానే స్వ‌యంగా పిలిచార‌ని… ప్ర‌స్తుతం రాష్ట్రంలో జ‌రుగుతున్న దేవాల‌యాల‌పై దాడులు.

న్యాయ వ్య‌వ‌స్థ‌పై వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకుని.జ‌గ‌న్‌కు త‌లంటేశార‌ని క‌థ‌నాలు వండివార్చారు.

ఇక‌, బాబు అనుకూల మ‌రో స‌మాచార వ్య‌వ‌స్థ‌లో రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్దిపై చ‌ర్చ‌లు జ‌రిపార‌ని, అదేస‌మయంలో పోల‌వ‌రం. జీఎస్టీ నిధులు.

వంటి వాటితోపాటు.మూడు రాజ‌ధానుల విష‌యాన్ని కూడా చ‌ర్చించార‌ని రాసుకొచ్చారు.

ఈ క‌థ‌నంలో ఎక్క‌డా.దేవాల‌యాల‌పై దాడుల విష‌యంలో అమిత్ షా త‌లంటేయ‌డానికే జ‌గ‌న్ ను పిలిచార‌నే వాద‌న ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

ఇదీ.జ‌గ‌న్ వ్య‌తిరేక స‌మాచార వ్య‌వ‌స్థ‌ల్లో వ‌చ్చిన ఢిల్లీ టూరు సంగ‌తులు.

ఇక‌, ఇప్పుడు వాస్త‌వంలోకి వ‌ద్దాం… నిజంగానే ఇప్ప‌టికిప్పుడు అమిత్‌షా.నేరుగా జ‌గ‌న్‌ను ఢిల్లీకి పిలిచి త‌లంటేసే ప‌రిస్థితి ఉందా?  దీనికి కార‌ణం.నిన్న‌నే ఎంతో మంది వ్య‌తిరేకించినా.వ్య‌వ‌సాయ బిల్లుకు జ‌గ‌న్ ఎంపీలు మ‌ద్ద‌తిచ్చారు.అంతేకాదు. విజ‌య‌సాయిరెడ్డి ఏకంగా.

రాజ్య‌స‌భ‌లో మోడీని ఆకాశానికి ఎత్తేసి.కాంగ్రెస్‌ను తూర్పార‌బ‌ట్టారు.

ఈ క్ర‌మంలో త‌మ‌కు మ‌ద్ద‌తిచ్చిన పార్టీ అధినేత‌ను ఢిల్లీకి పిలిచి మ‌రీ.హెచ్చ‌రిస్తారా ? .మ‌తున్న ఏ నాయ‌కుడు ఇది చేయ‌డు.!

ఇక‌, రెండో విష‌యానికి వ‌ద్దాం.

మోడీ, అమిత్‌షాలు కోరిన వెంట‌నే.న‌త్వానీకి.

రాజ్య‌స‌భ టికెట్ ఇచ్చారు.మ‌రి ఇంత‌గా.

జ‌గ‌న్ స‌హ‌క‌రిస్తే.కేవ‌లం త‌లంటడానికి పిలిచారు.

అంటూ రాసుకురావ‌డం ఏమేర‌కు పాత్రికేయ‌మో.చెప్పాలి.

మొత్తానికి ఈ ప‌రిణామం.రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

#Amith Shah #Chief Minister #Andhra Pradesh #Delhi Tour

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

New Gossips On Jagan Delhi Tour Related Telugu News,Photos/Pics,Images..