నయా మోసం: ప్రభుత్వ పథకాలు అంటూ... ఖాతా ఖాళీ..! జాగ్రత్త సుమీ..!

ప్రస్తుత రోజుల్లో ప్రతి చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వినియోగం సర్వ సాధారణం అయిపోయింది.దీనినే  కొంత మంది సైబర్ కేటుగాళ్లు ఆసరాగా తీసుకోని టెక్నాలజీని ఉపయోగించుకొని నయా మోసాలకు పాల్పడుతూ ఉన్నారు.

 New Fraud In The Name Of Government Schemes-TeluguStop.com

క్రెడిట్ కార్డ్ కు, ఆధార్ కార్డ్ లింక్ చేస్తామని, బ్యాంక్ అకౌంట్ కి ఫోన్ నెంబర్ అప్డేట్ చేస్తామని, ఇలా పలు రకాల సర్వీసులు అందజేస్తామని ప్రజలకు తెలిపి నయా మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ కేటుగాళ్లు.తాజాగా ప్రభుత్వ పథకాల పేరుతో అమాయకులైన ప్రజలను ముంచేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు.

ఇందుకు సంబంధించి కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వెలుగులోకి రావడం., తాజాగా కర్నూలు జిల్లాలో మరొక నయా మోసం చోటు చేసుకుంది.

 New Fraud In The Name Of Government Schemes-నయా మోసం: ప్రభుత్వ పథకాలు అంటూ… ఖాతా ఖాళీ.. జాగ్రత్త సుమీ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలోకి వెళ్తే.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కు చెందిన ఈరన్న కూతరు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది.

ఈ క్రమంలో ఆ అమ్మాయికి ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స అందజేశారు.ఇది ఇలా ఉండంగా ఈరన్నకి  ఒక గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి మీకు ఆరోగ్యశ్రీ కింద రూ.84,900 రూపాయలు మంజూరయ్యాయని తాను చెప్పినట్లు చేస్తే మీ అకౌంట్లో మొత్తం డబ్బులు జమ అవుతాయని తెలియజేశాడు.దీనితో ఈరన్నకు అనుమానం రావడంతో ఆ నెంబర్ ను ట్రూ కాలర్ లో సర్చ్ చేయగా అందులో ఆరోగ్యశ్రీ వెరిఫికేషన్ అని కనపడింది.దీనితో వీరన్న వెంటనే ఫోన్ పే ద్వారా ఆ వ్యక్తికి రూ.5000 రూపాయలు చెల్లించాడు.దీంతో తన అకౌంట్లో ఉండే డబ్బులు  మొత్తం దోచేయడంతో  బాధితుడు వెంటనే పోలీసులను సంప్రదించాడు.

Telugu Aarogya Sri Scheme Fraud, Adhar Link, Andhra Pradesh, Bank Account Update, Case Noted, Cheating, Cyber Crime, Cyber Fraud, Eeranna Daughter, Kurnool Dist, Money, Polices, Viral, Yemmiganur-Latest News - Telugu

ఇటీవల కాలం లోనే ఎమ్మిగనూరు లోని  గాంధీనగర్ కు చెందిన బాలకృష్ణయ్య అనే అతను కూడా మోసపోయిన సంఘటన బయటపడింది.అతడు కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.ఒకరోజు అనుకోకుండా ఆన్లైన్లో తెల్లకాగితాలు తక్కువ ధరకు వస్తున్నాయని ఎవరో తెలియజేయడంతో సెర్చ్  చేశాడు బాలకృష్ణయ్య.

వివరాలన్నీ గమనించిన ఒక సైబర్ కేటుగాడు తన అకౌంట్ లో డబ్బులు జమ చేస్తే  అతి తక్కువ ధరకే తెల్ల కాగితాలు పంపుతారని మాయమాటలు చేసి డబ్బులను జమ చేయెచ్చుకొని  నయా మోసానికి పాల్పడ్డాడు.ఈ క్రమంలో బాలకృష్ణయ్య తనకు ముందుగా పంపిన డబ్బును తిరిగి పంపాలని అడగక అప్పటి నుండి అతని సంప్రదించేందుకు ఎంత ప్రయత్నించినా కానీ ఆ వ్యక్తి  మొబైల్ ఆఫ్ చేసి ఉంది.

 దీంతో బాధితుడు బాలకృష్ణయ్య మోసపోయానని తెలుసుకుని వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు.ఇలా ఉండగా ప్రజలు ఇలాంటి  నయా మోసాల పట్ల తగిన జాగ్రత్తలు వహించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

#BankAccount #Adhar Link #Cheating #Case Noted #Yemmiganur

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు