నయా మోసం: విద్యార్థులు జర జాగ్రత్త..!

డబ్బులు ఎవ్వరికి ఊరికే రావు.అనే విషయం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి.

 New Fraud: Beware Of Students .. Money Scam, Money, Student Alert, Latest News,-TeluguStop.com

కష్ట పడకుండా డబ్బులు సంపాదించాలని అనుకుంటే పొరపాటు పడినట్లే.ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అనే సామెతలాగా తయారవుతుంది మన జీవితం.

పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినాగాని వారి మాటను పెడ చెవిని పెట్టి డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఎంతోమంది.తీరా డబ్బులు పోయక లబోదిబో మని ఏడిస్తే ఏమి లాభం చెప్పండి.

ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని కొంతమంది నేరగాళ్లు సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకుని వాళ్ళ దగ్గర నుండి భారీ మొత్తంలో డబ్బులను గుంజుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఒక లేటెస్ట్‌గా ఒక భారీ మోసం బయటపడింది.

మీరు 10వేలు కడితే.రోజుకు వేయి రూపాయిల లెక్కన 150 రోజులకు రూ.1.5లక్షలు ఇస్తామంటూ ‘పీవీ సోలార్‌ అప్లికేషన్స్‌‘ ఈ ఫ్రాడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

అయితే ఈ మోసగాళ్ళు ఐటీ కారిడార్‌ పరిధిలోని విద్యార్థులనే టార్గెట్ గా చేసుకున్నారు.ఈ యాప్ ద్వారా మోసపోయిన బాధితులు వేలల్లో ఉండడంతో సైబరాబాద్‌ పోలీసులు ఈ కేసును ఒక ఛాలెంజింగ్ తీసుకున్నారు.రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో 23 ఏళ్ల ఒక యువకుడు ఫిర్యాదుతో నెలరోజులుగా ‘పీవీ సోలార్‌ అప్లికేషన్స్‌’ పేరిట జరిగిన మొత్తం స్కామ్ బయట పడింది.‘పీవీ సోలార్‌ అప్లికేషన్స్‌ పేరిట ఒక యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌ లో అందుబాటులో ఉండగా దానిని ఇన్స్టాల్ చేసుకోగానే మొబైల్‌ నంబర్‌, అకౌంట్ వివరాలు అడుగుతుంది.

Telugu Latest, Scam-Latest News - Telugu

ఆ తరువాత అందులో ఎవరైనా సభ్యత్వం తీసుకుని రూ.10వేల మొదలు రూ.5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.కేటగిరీకి తగ్గట్టు డబ్బులు వస్తాయి అని స్టూడెంట్స్ కి ఆశ కల్పిస్తారు.

కేటగిరీ ఎంపిక చేసుకుని, ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం తదితర యాప్‌ల ద్వారా డబ్బులను చెల్లించే అవకాశం కూడా కల్పిస్తారు.కొన్ని రోజుల పాటు యాప్ బాగానే వర్క అయింది.

అలా ఆ నోటా ఈ నోటా ప్రచారం జరిగి ఎక్కువమంది స్టూడెంట్స్ డబ్బులను డిపాజిట్ చేయగా ఆ తర్వాతే మోసగాళ్ల అసలు రంగు బయటపడినట్లు బాధితులు చెబుతున్నారు.ఇప్పుడు ఈ యాప్ ఓపెన్‌ ‘ఎర్రర్‌‘ అని వచ్చి క్లోజ్‌ అయిపోతుంది.

ప్రస్తుతం ఈ కేసును పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube