లాభాల్లో స్టాక్ మార్కెట్ ఆరంభం అదిరింది..!

ఏప్రిల్ 1 ఆర్ధిక సంవత్సరం మొదటి రోజు భారత స్టాక్ మార్కెట్ మంచి ఆరంభాన్ని ఇచ్చింది.స్టాక్ మార్కెట్ లో ఉత్సాహభరితమైన లావాదేవీలు జరిగాయి.సెన్సెక్స్ 520.68 పాయింట్ల లాభంతో మొదలై 50,029.83 వద్ద ముగిసింది.నిఫ్టీ కూడా 176.70 పాయిట్ల వృద్ధి రేటుతో 14,867.40 కి చేరింది.ఏప్రిల్ 1న ట్రేడింగ్ లో 2,120 షేర్లు ముందంజలో ఉన్నాయి.మరో 727 షేర్లకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.143 షేర్లు మాత్రం కాన్ స్టంట్ గా ఉన్నాయి.

 New Financial Year Firstday April 1st Stock Market Ended With Profits , April 1s-TeluguStop.com

నిఫ్టీలో హిండాల్కో, జే.ఎస్.డబ్ల్యు స్టీల్, టాటా స్టీన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదాని పోర్బ్స్ వంటివి లాభాల బాట పట్టాయి.నెస్లే ఇండియా, టి.సి.ఎస్, హిదూస్థాన్ యూనిఈలివర్, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్, హెచ్ డీ ఎఫ్ సీ ఇన్సూరెన్స్ షేర్లు నష్టాలతో ముగిశాయి.ఎఫ్.ఎం.సి.సీ షేర్లు కూడా నష్టాల పాలయ్యాయి.అయితే మెటల్, ఆర్ధిక సంస్థల షేర్లు మాత్రం దేశీయ మార్కెట్ నిలబెట్టేలా లాభాలు తెచ్చిపెట్టాయి.

కొత్త ఆర్ధిక సంవత్సరం తొలిరోజు స్టాక్ కొద్దిగా ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు.ఈమధ్య కాలంలో ఎప్పుడూ లేని హయ్యెస్ట్ రేంజ్ లో స్టాక్స్ క్లోజ్ అయ్యాయి.ఇది ఓరకంగా దేశీయ మార్కెట్ కు మంచి శుభసూచికగా చెప్పుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube