మీరు ప్రతి రోజు వాడుతున్న వాట్సప్‌లో ఈ మార్పులను గుర్తించారా?

ఒకప్పుడు వాట్సప్‌ అంటే కేవలం మెసేజ్‌లు పంపించుకోవడానికి మరియు ఫొటోలు షేర్‌ చేసుకోవడానికి మాత్రమే ఉండేది.2013 నుండి వాట్సప్‌ వినియోగం ఇండియాలో పెరగడం స్టార్ట్‌ అయ్యింది.అంతకు ముందు నుండే ఉన్నా కూడా అప్పుడు స్మార్ట్‌ ఫోన్‌లు చాలా చాలా తక్కువగా ఉండేవి.కనుక 2013 మరియు 2014 నుండి వాట్సప్‌ వినియోగం విపరీతంగా పెరిగింది.2016లో విజృంభించింది.ఇక జియో వచ్చిన తర్వాత వాట్సప్‌ వినియోగం పీక్స్‌కు పోయింది.

 New Features In Whatsapp Latest Update-TeluguStop.com

Telugu Indian Whatsapp, Whatsapp Latest, Peole Whatsapp, Whatsapp-

ఇండియాలో వాట్సప్‌ వినియోగదారులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో నెలకు ఒక అప్‌డేట్‌ చొప్పున కొత్త ఫీచర్స్‌ను తీసుకు వస్తూనే ఉంది.వాట్సప్‌ను ఎప్పుడైతే ఫేస్‌బుక్‌ టేకోవర్‌ చేసిందో అప్పటి నుండి మార్పులు మొదలయ్యాయి.మొదట వాయిస్‌ కాల్స్‌ ఫీచర్‌ తీసుకు వచ్చిన వాట్సప్‌ సంచలనానికి తెర లేపింది.ప్రపంచంలో ఏమూలన ఉన్నా కూడా వాట్సప్‌ కాలింగ్‌ చేసుకోవచ్చు.వాట్సప్‌ కాలింగ్‌తో మొబైల్‌ ఆపరేటర్లకు అంతర్జాతీయ కాల్స్‌ ద్వారా వచ్చే ఆదాయం పడిపోయింది.ఇక ఆ తర్వాత వీడియో కాలింగ్‌ మరో సంచలన విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చింది.

Telugu Indian Whatsapp, Whatsapp Latest, Peole Whatsapp, Whatsapp-

మన దేశంలో దాదాపుగా 30 శాతం మంది కేవలం వాట్సప్‌ కోసం స్మార్ట్‌ ఫోన్‌ వాడుతున్నారని ఒక సర్వేలో వెళ్లడయ్యింది.ఫొటోలు పంపించడం కోసం వీడియో కాలింగ్‌ కోసం వారు స్మార్ట్‌ ఫోన్‌లు కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు.ఇక వాట్సప్‌లో ఇంకా కొత్త కొత్త ఫీచర్స్‌ వస్తూనే ఉన్నాయి.

Telugu Indian Whatsapp, Whatsapp Latest, Peole Whatsapp, Whatsapp-

మొన్నటి వరకు ఒక వాయిస్‌ మెసేజ్‌ను పంపాలి అంటే రికార్డ్‌ చేసి పంపిచాల్సి వచ్చేది.అయితే అందులో తప్పులు ఉంటే చేసేది ఏమీ లేదు.కాని ఇప్పుడు అలా కాదు.

ఒక వాయిస్‌ను రికార్డ్‌ చేసి దాన్ని ఒకటికి రెండు సార్లు పది సార్లు ఇలా ఎన్ని సార్లు అయినా విని ఆ తర్వాత పంపవచ్చు.ఒకప్పుడు వాట్సప్‌ మెసేజ్‌లు డిలీట్‌ చేసే ఆప్షన్‌ లేకుండా ఉండేది.

కాని అవతల వారికి వెళ్లిన వాట్సప్‌ మెసేజ్‌లను కూడా డిలీట్‌ చేసే ఆప్షన్‌ వచ్చింది.గ్రూప్‌లో ఎవరు పడిఏ వారు యాడ్‌ చేయకుండా పర్మీషన్‌ ఆప్షన్‌ పెట్టడం జరిగింది.

Telugu Indian Whatsapp, Whatsapp Latest, Peole Whatsapp, Whatsapp-

వాట్సప్‌లో మరో ముఖ్యమైన ఫీచర్‌ ఏంటీ అంటే గ్రూప్‌ వీడియో కాలింగ్‌.మనం సాదారణంగా కాన్ఫెరెన్స్‌ కాలింగ్‌ మాట్లాడుతూ ఉంటాం.అదే వీడియోలో కాన్ఫెరెన్స్‌ కాలింగ్‌ మాట్లాడితే ఆ మజానే వేరుగా ఉంటుంది కదా.దాన్ని మనకు వాట్సప్‌ తీసుకు వచ్చింది.నలుగురు వరకు వాట్సప్‌లో కాన్ఫెరెన్స్‌ మాట్లాడే అవకాశం ఉంది.ఒకరిని చూసుకుంటూ ఒకరు నలుగురు మాట్లాడటంతో అంతా ఒక్కచోట ఉన్న ఫీలింగ్‌ కలుగుతుంది.ఇవే కాకుండా ఇంకా స్టిక్కర్స్, ఫింగర్ ప్రింట్ సెక్యూరిటీ ఇంకా చాలా చాలా కూడా అందుబాటులోకి వచ్చాయి.ఎన్నో ఎనెన్నో ఫీచర్స్‌ను వాట్సప్‌ ఈ రెండు మూడు ఏళ్లలో వినియోగదారులకు తీసుకు వచ్చింది.

ఇప్పటి వరకు మేము చెప్పిన ఫీచర్స్‌ మీ వాట్సప్‌లో లేనట్లయితే వెంటనే ప్లే స్టోర్‌కు వెళ్లి అప్‌డేట్‌ చేసుకోండి.అప్పుడు అన్ని ఫీచర్స్‌ మీ స్మార్ట్‌ ఫోన్‌లో కూడా వస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube