మరికొన్ని ఫీచర్స్ ని తీసుకు రాబోతున్న వాట్సాప్..!

ప్రపంచంలో అనేక మంది ఎక్కువగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ ఏమిటి అంటే అందరూ ఇట్లే చెప్పేస్తారు వాట్సాప్ అని.అలాగే ఎప్పటికప్పుడు వాట్సాప్ వారి వినియోగదారులకు అప్డేటెడ్ ఫీచర్స్ ను అందజేస్తూ ఉంది.

 Whats App, New Update, Mute Video, Read Letter, Desktop Video, Voice Calls, Arch-TeluguStop.com

తాజాగా డెస్క్ టాప్ వెర్షన్ ఉపయోగించే వారికి వాయిస్, వీడియో కాల్స్ ను వాట్సప్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.ఇక ఈ కొత్త సంవత్సరం మరిన్ని ఫీచర్లను చేసేందుకు సిద్ధమవుతోంది వాట్సాప్ అవి ఏమిటో ఒకసారి చూద్దామా.? అవి ఏమిటి అంటే.మల్టీ డివైజ్ సపోర్ట్, వాట్సాప్ ఇన్సూరెన్స్, మిస్టర్ గ్రూప్ కాల్స్, వెబ్ డెస్కుటాప్ యాప్స్ నుంచి కాల్స్, ముట్ వీడియో, రీడ్ లెటర్ లాంటి ఫీచర్లను వినియోగదారులకు అందజేసేందుకు సిద్ధమయ్యింది వాట్సాప్ సంస్థ.

ఇక ఇప్పటికే మనము వాట్సాప్ ఇన్సూరెన్స్, వెబ్సైట్ యాప్ నుంచి వాయిస్ వీడియో కాల్స్ గురించి మనం తెలుసుకునే ఉన్నాం.

గ్రూప్ కాల్స్ అంటే ఏమిటో ఇప్పుడు ఒకసారి చూద్దామా.

ఎవరైనా గ్రూప్ కాల్స్ ప్రారంభించిన మధ్యలో మరో యూసర్ జాయిన్ చేసుకునేందుకు సహాయపడుతుంది.ఇది చూడడానికి చాలా చిన్న ఫీచర్ అయినప్పటికీ ఎవరైనా కాల్ మిస్ అయితే కట్ చేసి మళ్లీ వారిని కనెక్ట్ చేయడం కంటే యాడ్ చేసేలా ఫ్యూచర్ ఉంటే చాలా ఉపయోగం ఉంటుందని సంస్థ వారు ప్రవేశ పెట్టారు.

అంతేకాకుండా గ్రూప్ కాల్స్ ను ఎవరు కూడా మిస్ అవకుండా ఉండేందుకు చాలా ఈజీగా ఉంటుందని వారు భావించారు.

Telugu Add, Archived Chats, Desktop, Mute, Read Letter, Whats App-Latest News -

ఇదిలా ఉండగా మరో ఫ్యూచర్ విషయానికి వస్తే.ప్రస్తుతం వీడియో పంపేటప్పుడు కానీ, స్టేటస్ లో వీడియో అప్డేట్ చేసేటప్పుడు కానీ వీడియోలను మ్యూట్ చేసే ఫ్యూచర్ లేదు.ఇక ఈ ఫీచర్ కు అప్డేట్ గా ఈ ఏడాది ప్రవేశ పెట్టబోతోంది.

ఇక మరో ఫ్యూచర్ విషయానికి వస్తే.రీడ్ లెటర్.

.ఈ రీడ్ లెటర్ అనేది ఆర్చీవ్​ డ్​ చాట్స్​కు లేటెస్ట్ వర్షన్ అని అనుకోవచ్చు.

ఎవరైనా ఒక చాట్ ను ఎప్పుడైనా రీడ్ లెటర్ కు పంపితే వాట్సప్ దానిని నోటిఫికేషన్లకు పంపదు.ఇక ఈ ఫీచర్ ను కూడా ఈ కొత్త సంవత్సరం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది వాట్సాప్.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ అప్ డేట్స్ వచ్చినప్పుడు వాట్సప్ యాప్ అప్డేట్ చేసి ఎంజాయ్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube