'వాట్సాప్' లో అదిరిపోయే కొత్త ఫీచర్ !     2018-11-08   09:18:22  IST  Sai Mallula

ఇప్పుడు ప్రతి ఒక్కరు సమాచారం అటు ఇటు చేరవేసుకోవడానికి వాట్సాప్ వాడుతున్నారు. వాట్సాప్ లేని ఫోన్ లు చాలా అరుదు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకువస్తూ మరింత ఆకట్టుకుంటోంది.

New Featured Lanching By Whatsapp-

New Featured Lanching By Whatsapp

తాజాగా వాట్సాప్ కొత్తగా ఓ ఫీచర్ అనుబాటులోకి తీసుకువచ్చింది. చాలామంది వాట్సాప్ లో ఉండే గ్రూప్ లు కారణంగా చాలా ఇబ్బంది ‘పడుతుంటారు. ఆ గ్రూప్ లో వచ్చే ఫోటోలు.. వీడియో లు కారణంగా తమ ఫోన్ మెమరీ ఫుల్ అయిపోతోందని బాధపడిపోతుంటారు . అలాంటి వారి కోసం వాట్సాప్ కొత్త ఆప్షన్ తీసుకువచ్చింది.

మీరు వుండే గ్రూప్ ఓపెన్ చేసి 3 చుక్కలు తాకి *group info* open చెయ్యండి. అక్కడ media visibility అని ఒక option కొత్తగా చేరింది. అది No అని సెట్ చేస్తే photos and videos whatsapp లో కనబడతాయి కానీ phone memory లోకి రావు.

ఈ option ఏ గ్రూప్ కు ఆ గ్రూప్ ప్రత్యేకంగా ఉంటుంది.