వాట్సాప్ అంటే ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమే.దీనిని వాడని వారంటూ ఎవ్వరూ ఉండరు.
యూజర్ల సమాచార భద్రతా విషయంలో వాట్సాప్ అనేక ఫీచర్లను తెస్తూ ఉంటుంది.అలాగే అధునాతన టెక్నాలజీతో కూడిన ఫీచర్లను యూజర్లకు పరిచయం చేస్తూ ఉంటుంది.
తాజాగా ఓ సరికొత్త ఫీచర్ ను వాట్సాప్ తీసుకొచ్చింది.యాప్ నుంచే నేరుగా వాట్సాప్ సపోర్ట్ ను సంప్రదించడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.ప్రస్తుతం ఈ ఫీచర్‌పై వాట్సాప్ పనిచేయడం విశేషం.ఇప్పటికే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా టెస్టర్లకు అందుబాటులోకి రావడంతో అతి త్వరలోనే ఇది అందరికీ చేరనుంది.
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి.ఈ ఫీచర్‌ను గతేడాది మార్చి నెలలోనే వాట్సాప్ విడుదల చేసింది.అయితే బీటా ఫీచర్ గా ఉండటం వల్ల ఆ ఫీచర్ ను ఆపేశారు.ఆండ్రాయిడ్‌లో అయితే వాట్సాప్ బీటా వెర్షన్ 2.22.3.5, ఐఓఎస్‌లో అయితే బీటా వెర్షన్ 22.7.72లో కొత్త ఇన్-యాప్ చాట్ సపోర్ట్ ఫీచర్ మనకు కనిపిస్తుంది.
ఈ ఫీచర్ ను చాలా సులభంగా పొందొచ్చు.
మొదటగా మీరు సెట్టింగ్స్, హెల్ప్, కాంటాక్ట్ అస్ ఆప్షన్స్ లోకి వెళితే వాట్సాప్ కస్టమర్ సపోర్ట్‌తో చాట్ లోనే కనెక్ట్ అవుతారు.ఆ తర్వాత వాట్సాప్ సెట్టింగ్స్‌లోని వెళ్లి హెల్ప్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
మీ ఫిర్యాదు లేదా రిపోర్ట్ ను స్క్రీన్ కింది భాగంలో ఉంచాలి.అప్పుడు ‘ వి విల్ రెస్పాండ్ టు యు ఇన్ వాట్సాప్ చాట్ ‘ అని ఒక మెసేజ్ వస్తుంది.
దానికి పక్కనే ఉన్నటువంటి నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేస్తే వాట్సాప్ సపోర్ట్ టీమ్‌కు సంబంధించిన ఒక కొత్త చాట్‌ను వాట్సాప్ క్రియేట్ చేయడం జరుగుతుంది.చాట్ బాక్స్ లో కనిపించే ఈ కొత్త చాట్‌లో యూజర్లు తమ ఫిర్యాదులను తెలియజేయవచ్చు.
దీని ద్వారా వాట్సాప్ నుంచి సపోర్ట్ కూడా పొందొచ్చు.ఇది వాట్సాప్ లోని చాలా సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుంది.