నెట్ ఫ్లిక్స్ కి అడిక్ట్ అవుతున్నారా? అయితే ఈ ఫీచర్ ను ఉపయోగించండి.

పెరుగుతున్న సాంకేతిక టెక్నాలజీ వల్ల స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో ఓటీటీ సేవలు బాగా పాపులర్ అయ్యాయి.ఓటీటీ ఫ్లాట్ ఫాం వేదికగా ఎన్నో వెబ్ సిరీస్ లు,సినిమాలు విడుదలవడంతో ఎంతోమంది స్మార్ట్ ఫోన్ యూజర్లు నిరంతరం ఫోన్ లకే పరిమితం అవుతున్నారు.

 New Feature In Netflix, New Future, Netflix, Technology Develop, Smart Phones-TeluguStop.com

చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు వెబ్ సిరీస్ లను ఓపెన్ చేస్తే నిరంతరం ఒకదాని తర్వాత మరొక ఎపిసోడ్ లను పూర్తి చేస్తుంటారు.ఈ విధంగా నెట్ ఫ్లిక్స్ కి అడిక్ట్ కావడంవల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు.

ఈ విధంగా నిరంతరం వెబ్ సిరీస్ లను చూడటం ద్వారా నిద్ర పాడవడంతో పాటు కళ్లకు కూడా ప్రమాదం అని భావిస్తున్నారు.అయితే ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టడానికి నెట్ ఫ్లిక్స్ సమస్త సరికొత్త ఫీచర్ ని యూజర్లకు అందుబాటులోకి తీసుకు వచ్చింది.

ఇకపై నెట్‌ఫ్లిక్స్‌ను యాక్సెస్ చేసే సమయంలో సెట్ చేసుకునే సమయానికి స్ట్రీమింగ్ అయిపోయే విధంగా సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.ఈ ఫీచర్ వల్ల మనం సెట్ చేసుకున్న ఎపిసోడ్ నిమిషాలు, గంటల వ్యవధిలో అయిపోయే విధంగా సెట్ చేసుకోవచ్చు.

ఈ విధంగా చేయడం వల్ల ఆ సమయానికే వీడియో ఆగిపోతుంది.

Telugu Netflix, Smart-Latest News - Telugu

ఈ ఫీచర్ అందుబాటులోకి రావడం వల్ల మనం పూర్తిగా నెట్ ఫ్లిక్స్ కి అడిక్ట్ కాకుండా ఉండగలం.తద్వారా కళ్ళకు ఎటువంటి ప్రభావం లేకుండా మంచి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.ముఖ్యంగా ఈ ఫీచర్ అందుబాటులోకి రావడం వల్ల చిన్నపిల్లలను ఈ వెబ్ సిరీస్ లను చూడటాన్ని పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు.

ప్రస్తుతం ఈ ఫీచర్ కేవలం ఆండ్రాయిడ్ వెర్షన్ కు మాత్రమే అందుబాటులో ఉంది.త్వరలోనే ఈ ఫీచర్ ను టీవీలు, ల్యాప్ టాప్, ఇతర గ్యాడ్జెట్లకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ తెలియజేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube