కొత్త ఫీచర్ ని తీసుకు వచ్చిన ఇంస్టాగ్రామ్..!

ప్రస్తుత రోజులలో ప్రతి చిన్న పిల్లవాడి నుంచి పెద్ద వారి వరుకు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.సోషల్ మీడియాలో గంటల తరబడి వారి  సమయాన్ని గడపడం ద్వారా మనుషుల మధ్య దూరాన్ని మరింత పెంచేస్తోంది.

 New Feature From Instagram  Instagram, New Feature, Video Calls, Interviews, Liv-TeluguStop.com

దీనితో బంధాలకు విలువలు లేకుండా అయిపోతుంది.అంతేకాకుండా సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నా కానీ.

వాటి నుంచి దూరం అవ్వకుండా ఉండలేకపోతున్నారు కొంతమంది.ఈ తరుణంలో సోషల్ మీడియా యప్స్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ప్రజలను ఆకట్టుకుంటూ సంగతి అందరికి తెలిసిందే.

ఈ పోటీ ప్రపంచంలో వినియోగదారులకు కావాల్సిన అన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు యాప్స్ పోటీ పడుతున్నాయి.

తాజాగా ఇంస్టాగ్రామ్ యూజర్స్ కోసం సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.

లైవ్ రూమ్స్ అనే పేరుతో లైవ్ బ్రాడ్ కాస్ట్ లో ఒకేసారి నలుగురు కలిసి వీడియో కాల్ మాట్లాడుకునే విధంగా ఇంస్టాగ్రామ్ సరికొత్త ఫ్యూచర్ రూపొందించింది.ఈ ఫీచర్ ద్వారా పాడ్ కాస్ట్, లైవ్ షో, మొదలగు వాటన్నిటి ఒకేసారి నలుగురితో మాట్లాడే అవకాశం ఉంటుంది.

ఇప్పటివరకు ఈ ఫ్యూచర్ ఇన్స్టంట్ మెసేజ్ వాట్సాప్ లో అందుబాటులో ఉంది.ఇంస్టాగ్రామ్ కూడా అదే ఫీచర్లు తీసుకొనివచ్చి యూజర్స్ లో మరింత ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అంతేకాకుండా ఫీచర్లు వినియోగిస్తూ జామ్ సెషన్లు, ఇంటర్వ్యూలను కూడా నిర్వహించుకోవచ్చు ఇంస్టాగ్రామ్ సంస్థ తెలియజేసింది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఇంస్టాగ్రామ్ సరికొత్త ఫ్యూచర్ ను వినియోగించుకోండి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube