కేసీఆర్ క్యాబినెట్ లో కొత్త ముఖాలు..ఎవరెవరంటే..???

తెలంగాణలో మరో సారి తిరుగులేని ఆధిక్యతతో కేసీఆర్ విజయకేతనం ఎగురవేశారు.ప్రత్యర్ధి పార్టీలకి మైండ్ బ్లాక్ అయ్యేలా తన సత్తా చూపించారు.

 New Faces In Kcr Cabinet-TeluguStop.com

ఒక దెబ్బకి నాలుగు పార్టీలు తునా తునకలు అయ్యాయి.చంద్రబాబు నాయుడు పాచికలు ఎక్కడా పారలేదు సరికదా ఉన్న పరువు కాస్తా కొట్టుకు పోయింది.

ఆంధ్రా సెటిలర్స్ తన బలమని డబ్బాలు కొట్టుకున్న బాబు కి భారీ షాక్ ఇచ్చారు ఆంధ్రా ఓటర్లు.అంతేకాదు కూకట్ పల్లి లో సైతం తెలుగుదేశం ఓడిపోవడంతో ఇక తెలుగుదేశానికి తెలంగాణలో నూకలు చెల్లిపోయాని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు…ఇదిలాఉంటే.

కేసీఆర్ రెట్టింపు సంతోషంతో మాట్లాడుతూ టీడీపీ పై చేస్తున్న కామెంట్స్ టీడీపీ అధినేత కి గుబులు పుట్టిస్తున్నాయి.అయితే ప్రస్తుతం కేసీఆర్ తెలంగాణలో తన నూతన మంత్రి వర్గం కూర్పులో బిజీ బిజీగా ఉన్నారు.త్వరలో కీలక భేటీ కావడంతో పాటు కొత్త ముఖాలని ఎంపిక చేయడం కోసం కసరత్తులు ప్రారంభించారు.దాదాపు క్యాబినెట్ లోకి కొత్త వారికే ఛాన్సులు దక్కేలా ఉన్నాయి…అత్యంత ప్రణాలికా బద్దంగా ఈ చేర్పులు చేయనున్నాట్టుగా తెలుస్తోంది.

కేసీఆర్ ఈ సారి గతంలో క్యాబినెట్ కూర్పులో వచ్చిన విమర్సలకి దీటుగా సమాధానం చెప్పనున్నారట.అందులో భాగంగానే.ఈ సారి తన టీం లోకి మహిళలకి అధిక ప్రాధ్యాన్యత ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది.దళితులని సీఎం చేస్తాను అన్నారు అని కాంగ్రెస్ చేస్తున్న కామెంట్స్ కి సైతం కేసీఆర్ దిమ్మతిరిగే జవాబు ఇవ్వనున్నారట.అంతేకాదు విద్యార్ధి సంఘాల నేతలకి గతంలో పదవులు ఇవ్వకపోయినా ఈసారి మాత్రం వారికి చోటు కల్పిస్తున్నారని తెలుస్తోంది ఈ క్రమంలోనే

విద్యార్ధి పోరాటాల నుంచీ వచ్చిన బాల్కా సుమన్ ని తన మంత్రి వర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది…బాల్క సుమన్ గతంలో ఎంపీగా పోటీ చేశారు.ఈ సారి మాత్రం ఆయన ఎమ్మెల్యే గా పోటీ చేయడం వెనుక ఆంతర్యం ఇదే అంటున్నారు…అలాగే ఉద్యమాల నుంచీ వచ్చిన శ్రీనివాస్ గౌడ్ కి సైతం ఈ సారి కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వనున్నారని తెలుస్తోంది.ఇలా కేసీఆర్ ఎంతో మంది కొత్త వారికి వివిధ వర్గాల వారికి ముందుగా ప్రాధన్యత ఇవ్వనున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube