ఈట‌ల‌కు కొత్త క‌ష్టం.. ఈసారి రంగంలోకి ఏసీబీ!

ఈట‌ల రాజేంద‌ర్‌పై టీఆర్ ఎస్ ప్ర‌భ‌త్వం వేటు వేసిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న ఎపిసోడ్ రాష్ట్ర రాజ‌కీయాల్లో ఇంకా హ‌ల్ చ‌ల్ చేస్తూనే ఉంది.ప్ర‌స్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో టీఆర్ ఎస్‌, బీజేపీ హోరా హోరీగా ప్ర‌చారాలు సాగిస్తున్నాయి.

 New Difficulty For Etala Acb Enters The Field This Time, Etela Rajender, Acb , I-TeluguStop.com

ఇక ఎలాగైనా గెలిచేందుకు ఇరు పార్టీలు మ‌ల్ల గుల్లాలు ప‌డుతున్నాయి.అయితే తాను ఎలాగైనా గెలుస్తాన‌ని ధీమాతో ఈట‌ల రాజేంద‌ర్ దూసుకుపోతున్నారు.

ఇక ఆయ‌న‌కు ఎలాగైనా చెక్ పెట్టాల‌ని టీఆర్ ఎస్ కూడా ప‌క్కా ప్లాన్లు వేస్తోంది.

ఇప్ప‌టికే ఆయ‌న‌పై ఉన్న కేసుల‌ను బ‌య‌ట‌కు తీసేందుకు ఎత్తుగ‌డ‌లు వేస్తున్న కేసీఆర్ ప్ర‌భ‌త్వం ఎక్క‌డెక్క‌డ ఏమేం లిటుకులు ఉన్నాయో అవ‌న్నీ బ‌య‌ట‌కు తీసే ప‌నిలో ప‌డింది.

ఇక ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే అచ్చంపేట భూముల వ్య‌వ‌హారాన్ని ఎత్తుకున్న ప్ర‌భుత్వం ఈసారి మాత్రం నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ సొసైటీని తెర‌మీద‌కు తెచ్చింది.ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసే ముందు వ‌ర‌కు కూడా ఈట‌ల‌నే ఈ సొసైటీకి అధ్య‌క్షుడిగా కొన‌సాగారు.

Telugu @ktrtrs, Eetala Rajendar, Etela, Etela Rajender, Hyderabad, Society, Tela

అయితే ఇందులో కొన్ని అక్ర‌మాలు జ‌రిగిన‌ట్టు ఏసీబీకి ఫిర్యాదు అందిందంట‌.దాంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.ఇక వ‌చ్చిందే త‌డువు ఫిర్యాదులపై ఏసీబీ ఈరోజు తనిఖీలు కూడా మొదలు పెట్టేసింది.అది కూడా ఈట‌ల రాజేంద‌ర్‌పైనే ఫిర్యాదులు రావడంతో సోదాలు నిర్వ‌హించేందుకు అధికారులు ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం ముందుకెళ్తున్నారు.

కొన్ని నిధులు ప‌క్క‌దారి ప‌ట్టిన‌ట్టు, వాటిల్లో ఈటల ప్ర‌మేయం ఉందంటూ ఏసీబీ అధికారులు ఈ రోజు హైద‌రాబాద్ లోని సొసైటీ మెయిన్ ఆఫీసులో సోదాలు నిర్వ‌హించారు.అయితే దీనిపై ఇంకా ఈట‌ల రాజేంద‌ర్‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది.

అయితే త్వ‌ర‌లోనే ఆయ‌న్ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.మ‌రి దీనిపై ఈట‌ల రాజేంద‌ర్ ఏమైనా స్పందిస్తారా లేదా అన్న‌ది వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube