ప్రధాని ఫోన్ కాల్ తో జగన్ కు కొత్త తలపోట్లు ? 

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం సహాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నాయి.

 New Difficulties For Jagan With Pm Phone Call-TeluguStop.com

దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది.అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.

పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు కాకపోవడం తో ఈ పరిస్థితి ఎదురైంది.దీంతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 New Difficulties For Jagan With Pm Phone Call-ప్రధాని ఫోన్ కాల్ తో జగన్ కు కొత్త తలపోట్లు  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో నష్ట నివారణకు దిగిన ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేస్తూ , రాష్ట్రల పరిస్థితిపై ఆరా తీస్తూ కేంద్రం ఏ విధంగా సహకరిస్తుంది అనేది చెబుతూ,  ప్రధాని ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారు.అదే విధంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ తోను మోదీ సంభాషించారు.

అయితే ఇప్పుడు ఆ సంభాషణ పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 ప్రధాని ఫోన్ కాల్ పై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ట్వీట్ చేశారు.

గౌరవనీయులు ప్రధానమంత్రి ఫోన్ చేశారు.కేవలం ఆయన మనసులోని మాట చెప్పారు.

దానికి బదులు పనికొచ్చే మాటలు చెప్పి , పనికొచ్చే మాటలు వింటే బాగుండేది అంటూ హిందీలో ట్వీట్ చేశారు.దీనిపై ఏపీ సీఎం జగన్ స్పందించారు.

హేమంత్ ట్వీట్ ను తప్పుపడుతూ జగన్ ట్వీట్ చేశారు. ప్రియమైన హేమంత్ సోరెన్ .మీరంటే నాకు చాలా గౌరవం ఉంది మన మధ్య విభేదాలు ఉన్న ఇటువంటి సమయంలో రాజకీయం చేయడం తగదని అది మన జాతిని బలహీనపరుస్తుంది అని, ఒక సోదరుడు గా విజ్ఞప్తి చేస్తున్న, , మనం కోవిడ్ పై పోరాడుతున్నాం.ఇది ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే సమయం కాదు.

ఈ కరోనా మహమ్మారి పై చేస్తున్న యుద్ధంలో మనమంతా కలిసి ప్రధాని కి అండగా నిలవాల్సిన సమయం ఇది అంటూ జగన్ ట్వీట్ చేయడం పై ఒడిశాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలాకా స్పందించారు.

Telugu Ap, Bjp, Carona Virus, Jagan, Jagan Support Bjp, Jagan Twits, Jarkand Cm, Modhi Phone Call, Prime Minister Modhi, Ysrcp-Telugu Political News

కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజశేఖర్ రెడ్డి వంటి పెద్ద నాయకుడి కుమారుడై ఉండి సిబిఐ, ఈడి దాడులకు భయపడి మీ రాజకీయ ప్రయోజనాల కోసం మోదీతో ఈ విధంగా లాలూచీ పడడం సరి కాదని,  మీరు ఎదగాలి జగన్ మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి అంటూ ఆయన ట్వీట్ చేయడం సంచలనం రేపుతోంది.ఇప్పటికే బీజేపీకి వైసీపీ కి మధ్య పరోక్ష బంధం కొనసాగుతోంది అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలోనే ఈ విధమైన వ్యవహారం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

#PrimeMinister #Ysrcp #Jagan #Carona Virus #Jagan Twits

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు