ఫేస్ బుక్ కు కొత్త క‌ష్టాలు.. లోగో మీద ర‌చ్చ‌

ఫేస్ బుక్‌.ఈ పేరు తెలియ‌ని వారుండ‌రేమో.

 New Difficulties For Facebook .. Write On The Logo, Facebook, Logo Issue , Anoth-TeluguStop.com

ఎందుకంటే సోషల్ మీడియా వేదిక‌ల్లో ఫేస్ బుక్ మొద‌టి స్థానంలో ఉంది.అందుకే ప్ర‌తి ఒక్క‌రూ దీన్ని ఎక్కువ‌గా వాడుతుంటారు.

ప్ర‌పంచంలో ఎక్క‌డ ఏమైనా కూడా వెంట‌నే మ‌న‌కు ఫేస్ బుక్ లో కినిపించాల్సిందే.అంత రేంజ్ లో దూసుకుపోతోంది ఈ ఫేస్ బుక్‌.

కానీ ఈ మ‌ధ్య మాత్రం త‌ర‌చూ వివాదాల్లో ఉంటోంది ఫేస్ బుక్‌.సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కూడా ఈ వివాదాల్లో ఇరుక్కుంటున్నారు.

ఆయ‌న కూడా చాలా సార్లు వివ‌ర‌ణ ఇవ్వాల్సి వ‌స్తోంది.దీంతో ఈ వివాదాల‌కు చెక్ పెట్టేందుకు ఆలో చిస్తున్నారు.

ఇప్ప‌టికే ప్రైవసీ పాలసీ విష‌యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా పెద్ద దుమారమే న‌డుస్తోంది.ముఖ్యంగా ఆసియా దేశాల్లో ఈ వ్య‌తిరేక‌త బాగా ఉంద‌ని చెప్పొచ్చు.ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్కువ మంది యూజ‌ర్లు మ‌న ఆసియా దేశాల్లోనే ఫేస్ బుక్ కు ఉన్నారు.దీంతో ఈ వ్య‌తిరేక‌త‌ను అడ్డుకునేంద‌కు జుక‌ర్ బ‌ర్గ్ ఏకంగా సంస్థ పేరు మార్చేయాల‌ని భావించాడు.

ఇందులో భాగంగానే మెటా అని కొత్త‌గా పేరు పెట్టారు.ఫేస్ బుక్ కంపెనీ స్టాక్స్ మొత్తం మెటావర్స్ తోనే లిస్ట్ అవుతాయ‌ని ఫేస్ బుక్ అధినేత వివ‌రించారు.

అయితే ఇక్క‌డే మ‌రో వివాదం చెల‌రేగుతోంది.

Telugu Alon, Company, German Company, Logo, Sense Migrane, Meta, Problems-Latest

ఏంటంటే మెటాకు కొత్త లోగో మీద విమర్శలు స్టార్ట్ అయ్యాయి.ఈ మెటా లోగో వేరే కంపెనీకి చెందిన లోగో ను పోలి ఉండ‌టంతో గతం కంటే ఎక్కువగా వ్య‌తిరేక‌త వ‌స్తోంది.ఈ లోగో మీద జర్మనీ దేశానికి చెందిన‌టువంటి ఎం-సెన్స్ Migräneస కంపెనీ అభ్యంత‌రం వ్య‌క్తం చేసంది.

మెటా లోగో త‌మ లోగోను పోలి ఉంద‌ని ట్విటర్ వేదికగా అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.దీంతో దీనిపై ట్విట్ట‌ర్ వేదిక‌గా భారీగా మీమ్స్ వ‌స్తున్నాయి.లోగో మీద భారీగా ట్రోలింగ్ న‌డుస్తోంది.ఆఖ‌ర‌కు ఇలా లోగో కూడా కాపీ కొడుతారా అంటూ ఫేస్ బుక్ మీద నెటిజ‌న్లు ట్రోల్ మొద‌లు పెట్టారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube