ఈ ఫ్యాన్ తో కరోనా వైరస్ కు చెక్..?

కరోనా వైరస్ పేరు వింటేనే ప్రజలు పడుతున్న టెన్షన్ అంతాఇంతా కాదు.అనేక మార్గాల ద్వారా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ ప్రజల్లో మానసిక ఒత్తిడిని పెంచుతోంది.

 New Device  To Combat Covid 19 Unveiled By Telangana Minister Etela Rajendar, Te-TeluguStop.com

వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వైరస్ ను కట్టడి చేసే అవకాశాలు ఉండగా సమర్థవంతమైన వ్యాక్సిన్ రావాలంటే మరికొన్ని నెలలు వేచి చూడక తప్పదు.వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ మానవ సంబంధాలను సైతం దెబ్బ తీస్తుండటం గమనార్హం.

మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు వినియోగించడం ద్వారా మాత్రమే కరోనా బారిన పడకుండా మనల్ని మనం సులువుగా రక్షించుకోవచ్చు.వ్యాక్సిన్ వచ్చేంత వరకు వైరస్ ను నియంత్రించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి.

కరోనా వైరస్ సోకకుండా చేసే కొత్త యంత్రాలు అందుబాటులోకి వస్తున్నాయి.స్కాలెన్ సైబర్నెటికస్ లిమిటెడ్ అనే బెంగళూరుకు చెందిన కంపెనీ కరోనాను అరికట్టే ఫ్యాన్ ను అందుబాటులోకి తెచ్చింది.

శైకోక్యాన్ అనే పేరుతో పిలిచే ఈ ఫ్యాన్ లివింగ్ రూమ్స్, ఏసీ రుమ్స్ లో కరోనా సోకకుండా చేయగలదు.సంస్థ ప్రతినిధులు హైదరాబాద్ లో ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ను కలిసి శైకోక్యాన్ ఫ్యాన్ యోక్క ప్రత్యేకతలను వివరించారు.1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఫ్యాన్ ను ఏర్పాటు చేసుకోవచ్చని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

సీఈవో డాక్టర్ రాజా విజయ్ కుమార్ కరోనా వైరస్ ను కట్టడి చేసే ఈ ఫ్యాన్ ఖరీదు 19,999 రూపాయలని తెలిపారు.

శైకోక్యాన్ ఫ్యాన్ మనం ఉండే గదిలోకి కరోనా వైరస్ వస్తే ఆ వైరస్ యొక్క స్పైక్ ప్రోటీన్ ను నాశనం చేస్తుంది.ఫలితంగా వైరస్ మనుషులకు సోకదు.

ఈ ఫ్యాన్ ఉన్న గదిలో 50 నుంచి 100 మంది వరకు సమావేశం నిర్వహించినా ఎవరూ వైరస్ బారిన పడరని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube